6జీలో భారత్‌దే పైచేయి

ABN , First Publish Date - 2022-10-03T08:31:48+05:30 IST

ఆరో తరం (6జీ) టెలికం టెక్నాలజీ ఆవిష్కరణలకు మన దేశం నాయకత్వం వహిస్తుందని కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్‌ అన్నారు.

6జీలో భారత్‌దే పైచేయి

కేంద్ర మంత్రి వైష్ణవ్‌

న్యూఢిల్లీ : ఆరో తరం (6జీ) టెలికం టెక్నాలజీ ఆవిష్కరణలకు మన దేశం నాయకత్వం వహిస్తుందని కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్‌ అన్నారు. ఇందు కు అవసరమైన అనేక టెక్నాలజీలు మన దేశీయ సంస్థల వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్నట్టు చెప్పా రు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రె స్‌లో ఐఐటీ-హైదరాబాద్‌ స్టాల్‌ను ఆయన సందర్శించి 6జీకి సంబంధించి వివిధ టెక్నాలజీలను పరిశీలించారు. ఈ స్టాల్‌లో ఐఐటీ-హైదరాబాద్‌లో అభివృద్ధి చేసిన అనేక 6జీ టెక్నాలజీలను ప్రదర్శిస్తున్నారు. ఈ టెక్నాలజీల సాయంతో స్పెక్ట్రమ్‌ను 5జీ కంటే రెండున్నర రెట్లు సమర్ధవంతంగా ఉపయోగించుకోవచ్చని మంత్రి చెప్పారు. నెట్‌వర్క్‌ వేగం కూడా అందుకు అనుగుణంగా పెరుగుతుందన్నారు. మలితరం 6జీ టెక్నాలజీ విషయంలో మన దేశం నాయకత్వ స్థాయిలో ఉండాలని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని వైష్ణవ్‌ గుర్తు చేశారు.

Updated Date - 2022-10-03T08:31:48+05:30 IST