లంచగొండితనంలో కాస్త మెరుగుపడ్డ భారత్

ABN , First Publish Date - 2021-11-17T23:34:47+05:30 IST

2020లో 45 పాయింట్లతో 77వ స్థానంలో ఉన్న భారత్.. ఈసారి 44 పాయింట్లు సాధించి 82వ స్థానానికి చేరింది. ప్రభుత్వంతో వ్యాపార లావాదేవీలు, లంచ నిరోధకం & అమలు, ప్రభుత్వం & పౌర సేవల్లో నిష్పాక్షికత, పౌర సమాజ పర్యవేక్షణ సామర్థ్యం..

లంచగొండితనంలో కాస్త మెరుగుపడ్డ భారత్

న్యూఢిల్లీ: లంచగొండితనం దేశాల జాబితాలో భారత్ కాస్త మెరుగుపడింది. ఐదు పాయింట్లు ఎగబాకి 82వ స్థానంలో ప్రస్తుతం నిలిచింది. ఇంతకు ముందు భారత్ 77వ స్థానంలో ఉంది. లంచ వ్యతిరేక ప్రమాణాల కొలతల ఆర్గనైజేషన్ ‘ట్రేస్’ (టీఆర్‌సీఈ) 194 దేశాలు, స్వతంత్రప్రతిపత్తి కలిగిన ప్రాంతాలు అధ్యయనం చేసిన అనంతరం విడుదల చేసిన ఈ జాబితాలో భారత్ పరిస్థితి క్రితం కంటే ఆశాజనంగా ఉండడం గమనార్హం. కాగా ఉత్తర కొరియా, తుర్కమెనిస్తాన్, వెనుజులా, ఎరిట్రియా దేశాలు అత్యంత అవినీతి దేశాల జాబితాలో తొలి స్థానంలో ఉన్నాయి. ఇక ఈ జాబితాలో అట్టడుగున డెన్మార్క్, నార్వే, ఫిన్‌లాండ్, స్వీడన్, న్యూజీలాండ్ దేశాలు ఉన్నాయి. అంటే ఈ దేశాలు లంచగొండితనం అత్యంత తక్కువగా ఉంది.


2020లో 45 పాయింట్లతో 77వ స్థానంలో ఉన్న భారత్.. ఈసారి 44 పాయింట్లు సాధించి 82వ స్థానానికి చేరింది. ప్రభుత్వంతో వ్యాపార లావాదేవీలు, లంచ నిరోధకం & అమలు, ప్రభుత్వం & పౌర సేవల్లో నిష్పాక్షికత, పౌర సమాజ పర్యవేక్షణ సామర్థ్యం అనే నాలుగు అంశాల ద్వారా ఈ జాబితాను రూపొందించారు. ఇకపోతే.. భారత సరిహద్దు దేశాలు వెనుకబడి ఉన్నాయి. పాకిస్తాన్, నేపాల్, చైనా, భూటాన్, బంగ్లాదేశ్ దేశాలు భారత్ కన్నా వెనుక వరుసలో ఉన్నాయి.

Updated Date - 2021-11-17T23:34:47+05:30 IST