భారత్‌కు 22 అపాచీ, 15 చినూక్‌ హెలికాప్టర్లు

ABN , First Publish Date - 2020-07-11T07:29:06+05:30 IST

భారత వాయుసేన (ఐఏఎఫ్‌) కు 22 అపాచీ, 15 చినూక్‌ యుద్ధ హెలికాప్టర్లను అమెరికా విమానయాన సంస్థ బోయింగ్‌ గత నెల జూన్‌లో అందజేసింది. ఈ విషయాన్ని ఐఏఎఫ్‌ అధికారులు శుక్రవారం వెల్లడించారు. మొత్తం 22 అపాచీ, 15

భారత్‌కు 22 అపాచీ, 15 చినూక్‌ హెలికాప్టర్లు

న్యూఢిల్లీ, జూలై 10: భారత వాయుసేన (ఐఏఎఫ్‌) కు 22 అపాచీ, 15 చినూక్‌ యుద్ధ హెలికాప్టర్లను అమెరికా విమానయాన సంస్థ బోయింగ్‌ గత నెల జూన్‌లో అందజేసింది. ఈ విషయాన్ని ఐఏఎఫ్‌ అధికారులు శుక్రవారం వెల్లడించారు. మొత్తం 22 అపాచీ, 15 చినూక్‌ యుద్ధ హెలికాప్టర్ల బట్వాడాను పూర్తిచేశామని బోయింగ్‌ తెలిపింది. దీంతోపాటు భారత సాయుధ బలగాల అవసరాలను తీర్చేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ఈ విమానాలను వాస్తవాధీన రేఖ వెంట స్థావరాలకు తరలించామని అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత అధునాతన, బహుళ పాత్రలను పోషించే యుద్ధ హెలికాప్టర్లలో ఏహెచ్‌-64ఈ అపాచీ ఒకటి. అలాగే చినూక్‌ హెలికాప్టర్లు కూడా బహుళ పాత్ర పోషిస్తాయి. బలగాలు, ఫిరంగులు, ఇతర ఆయుధాలు, ఇంధనాన్ని తరలించడానికి చినూక్‌ హెలికాప్టర్లను ఉపయోగిస్తారు. అపాచీ, చినూక్‌ హెలికాప్టర్ల కొనుగోలుకు 2015 సెప్టెంబరులో బోయింగ్‌తో భారత్‌ మళ్లీ బిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకొంది.

Updated Date - 2020-07-11T07:29:06+05:30 IST