భారత వృద్ధి రేటు 9.5 శాతమే

ABN , First Publish Date - 2021-07-28T06:58:46+05:30 IST

ఐఎంఎఫ్‌.. ప్రస్తుత ఆర్థి క సంవత్సరానికి (2021-22) భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది. ఈ కాలంలో జీడీపీ వృద్ధి రేటు 12.5 శాతం ఉంటుందని ఐఎంఎఫ్‌ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో పేర్కొంది.

భారత వృద్ధి రేటు 9.5 శాతమే

  • ఐఎంఎఫ్‌


వాషింగ్టన్‌: ఐఎంఎఫ్‌.. ప్రస్తుత ఆర్థి క సంవత్సరానికి (2021-22) భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది. ఈ కాలంలో జీడీపీ వృద్ధి రేటు 12.5 శాతం ఉంటుందని ఐఎంఎఫ్‌ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో పేర్కొంది. కొవిడ్‌ రెండో ఉధృతి కారణంగా 2021-22 జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 9.5 శాతానికి కుదించింది. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధి రేటు అంచనాలను 6.9 శాతం నుంచి 8.5 శాతానికి పెంచింది. గత ఆర్థిక సంవత్సరం, ఈ సంవత్సరం ఏప్రిల్‌-మే నెలల్లో కొవిడ్‌ భారత్‌ను తీవ్రంగా కుదిపేసిందని ఐఎంఎఫ్‌ పేర్కొంది. 

Updated Date - 2021-07-28T06:58:46+05:30 IST