టాప్‌లో భారత్‌

ABN , First Publish Date - 2021-03-07T09:33:08+05:30 IST

ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌పతో పాటు సాధారణ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో కూడా భారత్‌ అగ్రస్థానానికి చేరింది. టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ పట్టికలో టీమిండియా 72.2 శాతంతో 520 పాయింట్లు, ఆరు సిరీస్‌ విజయాలతో టాప్‌లో నిలిచింది...

టాప్‌లో భారత్‌

ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌పతో పాటు సాధారణ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో కూడా భారత్‌ అగ్రస్థానానికి చేరింది. టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ పట్టికలో టీమిండియా 72.2 శాతంతో 520 పాయింట్లు, ఆరు సిరీస్‌ విజయాలతో టాప్‌లో నిలిచింది. న్యూజిలాండ్‌ (70), ఆస్ట్రేలియా (69.2), ఇంగ్లండ్‌ (61.4) తర్వాతి మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ఇక, టెస్ట్‌ టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 2వ స్థానం నుంచి నెంబర్‌ వన్‌ ప్లేస్‌కు ఎగబాకింది. భారత్‌ ఖాతాలో ప్రస్తుతం 122 రేటింగ్‌ పాయింట్స్‌ ఉన్నాయి. న్యూజిలాండ్‌ (118), ఆస్ట్రేలియా (113), ఇంగ్లండ్‌ (105) తర్వాతి మూడు స్థానాల్లో నిలిచాయి.

Updated Date - 2021-03-07T09:33:08+05:30 IST