భారత్‌కు విమాన సర్వీసులపై ఎతిహాద్ కీలక ప్రకటన!

ABN , First Publish Date - 2021-07-17T14:16:58+05:30 IST

యూఏఈ నేషనల్ క్యారియర్ ఎతిహాద్ ఎయిర్‌వేస్ భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ విమాన సర్వీసులపై తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ మూడు దేశాల విమాన సర్వీసులను జూలై 31 వరకు సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.

భారత్‌కు విమాన సర్వీసులపై ఎతిహాద్ కీలక ప్రకటన!

అబుధాబి: యూఏఈ నేషనల్ క్యారియర్ ఎతిహాద్ ఎయిర్‌వేస్ భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ విమాన సర్వీసులపై తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ మూడు దేశాల విమాన సర్వీసులను జూలై 31 వరకు సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. యూఏఈ అథారిటీస్ భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ విమానాలను ఈ నెల 31 వరకు పూర్తిగా రద్దు చేసినట్లు ఎతిహాద్ పేర్కొంది. కనుక ఆయా దేశాలకు చెందిన ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిపెట్టుకుని విమాన టికెట్లు బుకింగ్ చేసుకోవాలని సూచించింది. ఇక ఇప్పటికే టికెట్ బుకింగ్ చేసుకున్న వారు భారీ సంఖ్యలో తమ కాంటాక్ట్ సెంటర్, సోషల్ మీడియా బృందాన్ని సంప్రదిస్తున్నారని, బుకింగ్ విషయంలో నేరుగా తమను కాంటాక్ట్ చేయొద్దని కోరింది.


అసీఫ్ అనే ప్రయాణికుడి ట్వీట్‌కు స్పందించిన ఎతిహాద్.. అతడికి కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది. జూలై 31 వరకు భారత్ నుంచి యూఏఈకి విమాన సర్వీసులు పూర్తి నిలిపివేసినట్లు వెల్లడించింది. ఇతర వివరాల కోసం ఎతిహాద్ అధికారిక వెబ్‌సైట్  https://t.co/hWA7ZGfiaFలో చూడాలని తెలిపింది. ఇదిలా ఉంటే.. యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(జీసీఏఏ) మాత్రం ఇప్పటివరకు భారత్‌కు విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఇక కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచి భారత విమాన సర్వీసులపై యూఏఈ నిషేధం విధించిన విషయం తెలిసిందే.      



Updated Date - 2021-07-17T14:16:58+05:30 IST