భారత తొలి యుద్ధ విమాన మహిళా పైలట్‌

ABN , First Publish Date - 2022-05-26T08:36:38+05:30 IST

హరియాణ యువతి కెప్టెన్‌ అభిలాష బరాక్‌ (26) చరిత్ర సృష్టించారు. భారత తొలి యుద్ధ విమాన మహిళా పైలట్‌గా రికార్డులకెక్కారు.

భారత తొలి యుద్ధ విమాన మహిళా పైలట్‌

న్యూఢిల్లీ, మే 25: హరియాణ యువతి కెప్టెన్‌ అభిలాష బరాక్‌ (26) చరిత్ర సృష్టించారు. భారత తొలి యుద్ధ విమాన మహిళా పైలట్‌గా రికార్డులకెక్కారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న కంబాట్‌ ఆర్మీ ఏవియేషన్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లో బుధవారం అభిలాషతో పాటు మొత్తం 36 మంది ఆర్మీ పైలట్లకు ‘‘వింగ్‌ కమాండర్‌’’ హోదా కల్పించారు. అభిలాష 2018లో ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ కార్ప్స్‌లో నియమితులయ్యారు. ఈమె కుటుంబానిది ఆర్మీ నేపథ్యం. తండ్రి ఓంసింగ్‌ కల్నల్‌గా పనిచేసి విరమణ పొందారు. పెద్దన్న 2013 నుంచి సైన్యంలో ఉన్నారు. అభిలాష.. సనావర్‌లోని లారెన్స్‌ స్కూల్‌లో చదివారు. ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ నుంచి బీటెక్‌ (ఈసీఈ) పూర్తిచేశారు.

Updated Date - 2022-05-26T08:36:38+05:30 IST