అంతర్జాతీయ విమానాలపై జనవరి 31 వరకూ నిషేధం.. భారత్ నిర్ణయం

ABN , First Publish Date - 2021-12-10T03:22:25+05:30 IST

ఒమైక్రాన్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక నిషేధాన్ని వచ్చే ఏడాది జనవరి 31 వరకూ పొడిగించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

అంతర్జాతీయ విమానాలపై జనవరి 31 వరకూ నిషేధం.. భారత్ నిర్ణయం

ఇంటర్నెట్ డెస్క్: ఒమైక్రాన్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక నిషేధాన్ని వచ్చే ఏడాది జనవరి 31 వరకూ పొడిగించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. మునుపటి ప్రణాళిక ప్రకారం.. ఈ నెల 15 నుంచి ఇంటర్నేషనల్ విమానాలపై నిషేధాన్ని ఎత్తేయాల్సి ఉంది. కానీ.. ఒమైక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వం వెనకడుగు వేసింది. 


కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత్ గతేడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు బ్రేకులు వేసింది. ఆ తరువాత.. క్రమంగా ఆంక్షలను తొలగిస్తూ వచ్చిన ప్రభుత్వం 28 దేశాలతో ఎయిర్ బబుల్ విధానాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఆయా దేశాల నుంచి వచ్చే విమానాలను మాత్రం దేశంలోకి అనుమతిస్తోంది. ఎయిర్ బబుల్ విధానంలో ఓ దేశం మరో దేశానికి విమాన సర్వీసులను కొన్ని ఆంక్షలకు లోబడి కొనసాగించవచ్చు.

Updated Date - 2021-12-10T03:22:25+05:30 IST