సెప్టెంబరు... బ్రస్సెల్స్... భారత్-EU FTA చర్చల తదుపరి రౌండ్

ABN , First Publish Date - 2022-07-03T23:09:21+05:30 IST

భారత్-యూరోపియన్ యూనియన్ FTA తదుపరి రౌండ్ చర్చలు సెప్టెంబరులో బ్రస్సెల్స్‌లో జరగనున్నాయి.

సెప్టెంబరు... బ్రస్సెల్స్...   భారత్-EU FTA చర్చల తదుపరి రౌండ్

న్యూఢిల్లీ : భారత్-యూరోపియన్ యూనియన్ FTA తదుపరి రౌండ్ చర్చలు సెప్టెంబరులో బ్రస్సెల్స్‌లో జరగనున్నాయి. ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఎ) కోసం మొదటి రౌండ్ చర్చలు ముగిసాయని, తదుపరి రౌండ్ చర్చలు సెప్టెంబరులో బ్రస్సెల్స్‌లో జరగనున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వాణిజ్యం, పెట్టుబడులు, భౌగౌళిక సూచికల(జీఐ)పై ప్రతిపాదిత ఒప్పందాలపై ఎనిమిదేళ్ల విరామం తర్వాత జూన్ 27న ప్రారంభమైన తొలి రౌండ్ చర్చలు... జూలై 1న ముగిసిన విషయం తెలిసిందే. ఈ రౌండ్‌లో... FTA యొక్క 18 పాలసీ ప్రాంతాలను కవర్ చేసే 52 సాంకేతిక సెషన్‌లు, పెట్టుబడి రక్షణ సహా GIలపై ఏడు సెషన్‌లు జరిగాయి. కాగా... European Unionతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం 2021-22లో USD 116.36 బిలియన్లకు చేరుకుంది. 

Updated Date - 2022-07-03T23:09:21+05:30 IST