Team India: లంకపై గెలుపుతో సరికొత్త రికార్డ్

ABN , First Publish Date - 2021-07-19T20:51:16+05:30 IST

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో నిన్న జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించిన

Team India: లంకపై గెలుపుతో సరికొత్త రికార్డ్

కొలంబో: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో నిన్న జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత జట్టు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. శ్రీలంకపై వన్డేల్లో భారత్‌కు ఇది 92వ విజయం. ఫలితంగా ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సరసన చేరింది. న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా, శ్రీలంకపై పాకిస్థాన్ అన్నేసార్లు విజయం సాధించాయి. రేపు (మంగళవారం) శ్రీలంకతో జరగనున్న రెండో వన్డేలోనూ ధవన్ సేన విజయం సాధిస్తే ఒకే జట్టుపై అత్యధిక మ్యాచుల్లో విజయం సాధించిన ప్రపంచ రికార్డు భారత్ సొంతమవుతుంది.

Updated Date - 2021-07-19T20:51:16+05:30 IST