మాట్లాకపోతే India చచ్చిపోతుంది: Rahul Gandhi

ABN , First Publish Date - 2022-05-24T21:54:53+05:30 IST

దేశంలోని ప్రజలను సమీకరించడంలో కాంగ్రెస్ పాత్ర, హిందూ జాతీయవాదం వంటి ప్రశ్నలకు భారత విద్యార్థులు రాహుల్‌కు సంధించారు. కాగా, రాహుల్ కార్యక్రమానికి కొంత దూరంలో ఉన్న విద్యార్థులు ‘రాహుల్.. మైనింగ్‌‌పై మీరిచ్చిన వాగ్గానాల్ని..

మాట్లాకపోతే India చచ్చిపోతుంది: Rahul Gandhi

లండన్: ఇండియా (India) బతకాలంటే మాట్లాడాలని ఒకవేళ మాట్లాడకపోతే చచ్చిపోతుందని కాంగ్రెస్ (Congress) పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. మాట్లాడనికి వీలులేకుండా ప్రజాస్వామ్య సంస్థలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారని, మీడియాను సైతం తమ గుప్పిట్లో పెట్టుకుని దేశాన్ని నిశ్శబ్దంగా ఉంచాలని చూస్తున్నారని, అయితే అది భారత్ కాదని, భారత్ అలా ఉండదని ఆయన అన్నారు. ప్రఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ(Cambridge University)లోని కార్పస్ క్రిస్టీ కాలేజ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఇండియా ఎట్ 75’ (India at 75) అనే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారత విద్యార్థులు అధికంగా ఉండే క్రిస్టీ కాలేజీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగే ప్రశ్నలకు రాహుల్ సమాధానాలు చెప్పారు.


దేశంలోని ప్రజలను సమీకరించడంలో కాంగ్రెస్ పాత్ర, హిందూ జాతీయవాదం వంటి ప్రశ్నలకు భారత విద్యార్థులు రాహుల్‌కు సంధించారు. కాగా, రాహుల్ కార్యక్రమానికి కొంత దూరంలో ఉన్న విద్యార్థులు ‘రాహుల్.. మైనింగ్‌‌పై మీరిచ్చిన వాగ్గానాల్ని నిలబెట్టుకోండి’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాగా, విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ ‘‘దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలపై క్రమబద్ధమైన దాడి కొనసాగుతోంది. పార్లమెంట్, ఎన్నికల వ్యవస్థ ఇలా అన్ని సంస్థల్ని ధ్వంసం చేసుకుంటూ పోతున్నారు. మీడియాను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఇండియాలోని ఏ మీడియాలోనైనా మనం 30 సెకన్లకు మించి మాట్లాడలేము. దేశాన్ని నిశ్శబ్దంలోకి నెట్టాలని చూస్తున్నారు. కానీ అలా వెళ్తే అది ఇండియా అవ్వదు. ఇండియా మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడకపోతే ఇండియా చచ్చిపోతుంది’’ అని అన్నారు.

Updated Date - 2022-05-24T21:54:53+05:30 IST