ఆ రెండు దేశాల వారికి e-visas లు ఇచ్చేది లేదన్న India..

ABN , First Publish Date - 2021-09-18T02:00:31+05:30 IST

కెనడా, బ్రిటన్ విషయంలో భారత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

ఆ రెండు దేశాల వారికి e-visas లు ఇచ్చేది లేదన్న India..

న్యూఢిల్లీ: కెనడా, బ్రిటన్ విషయంలో భారత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు దేశాలకు చెందిన పౌరులకు ఈ-వీసాలు నిరాకరించింది. ఈ మేరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు కీలక ప్రకటన చేశారు. కరోనా సమయంలో భారత ప్రయాణికుల ఎంట్రీపై కెనడా, యూకే కఠినంగా వ్యవహరించిన నేపథ్యంలోనే ఇప్పుడు భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు దేశాల అతితో కోవిడ్ సయమంలో భారత ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. అనంతరం రెండు దేశాల్లోని ఎంబసీ అధికారులు కలుగజేసుకుని సమస్యను పరిష్కరించారు.  


ఇవి కూడా చదవండి..

ఇకపై NRI లకు పిల్లలను దత్తత తీసుకోవడం చాలా సులువు..

Kuwait కు వెళ్తున్నారా..? పొరపాటున కూడా వీటిని తీసుకెళ్లొద్దు..!

"కెనడా, యూకే పౌరులకు ఈ ఏడాది ఆగస్టు మొదటి వారం నుంచి ఈ-వీసా సౌకర్యాన్ని నిలిపివేయం జరిగింది. ప్రస్తుతం వారు భారత ఎంబసీల్లో రెగ్యులర్ స్టిక్కర్ వీసాలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పర్యాటక వీసా ఇప్పటికే నిలిపివేయబడింది. ఇతర కేటగిరీ వీసాలపై భారత్‌కు వచ్చే ఈ రెండు దేశాల పౌరులు ఇప్పుడు కేవలం రెగ్యులర్ స్టిక్కర్ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలి." అని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అన్నారు. ఇక గాల్వాన్ వ్యాలీ ఘటన నేపథ్యంలో ఇప్పటికే డ్రాగన్ కంట్రీ చైనాకు ఈ-వీసా సౌకర్యాన్ని భారత్ నిలిపివేసింది. గతేడాది జూన్‌లో జరిగిన ఈ ఘటనలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ).. 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. 



Updated Date - 2021-09-18T02:00:31+05:30 IST