ఇండియాలో 3000 దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-04-05T01:23:52+05:30 IST

ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల 61,188 మంది చనిపోయారు. 11,40,598 మందికి కరోనా సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. 2,36,528 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్

ఇండియాలో 3000 దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: చూస్తుండగానే మన దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈరోజు సాయంత్రం నాటికి కరోనా కేసులు 3 వేల మార్కును దాటాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం నాటికి దేశవ్యాప్తంగా 3,072 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా వల్ల ఇప్పటి వరకు 75 మంది భారతీయులు కరోనా వల్ల మృతి చెందారు. కాగా కరోనా ప్రభావం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎక్కువగా ఉంది. ఈ ఒక్క రోజే 52 కరోనా కేసులు. రెండు మరణాలు ముంబైలో నమోదు అయ్యాయి.


ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల 61,188 మంది చనిపోయారు. 11,40,598 మందికి కరోనా సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. 2,36,528 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 8,42,882. అయితే మొత్తం కరోనా కేసుల్లో అమెరికాలోనే 278,960 నమోదు అయ్యాయి. అమెరికాలో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.

Updated Date - 2020-04-05T01:23:52+05:30 IST