న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్లో భారత్ 81 కోట్ల మైలురాయిని దాటింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 81,73,95,763 వ్యాక్సిన్లు వేశారు. ఇవాళ ఒక్క రోజే 85.68 లక్షల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ రికవరీ రేట్ 97.72 శాతానికి చేరిందని తెలిపింది. జులై రెండు తర్వాత రికవరీ రేట్ 97.72 శాతానికి చేరడం ఇదే ప్రథమమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అక్టోబర్లో 30 కోట్ల వ్యాక్సిన్లు వేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించుకుంది. డిసెంబర్ 31 నాటికి దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.