కరోనా కట్టడిలో భారత్‌ భేష్‌ : డబ్ల్యూహెచ్‌వో

ABN , First Publish Date - 2020-04-04T06:59:04+05:30 IST

కరోనా కట్టడికి భారత్‌ చేస్తున్న కృషిని చెప్పడానికి మాటలు చాలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయాసియా ప్రాంతీయ ఎమర్జెన్సీ డైరెక్టర్‌ డాక్టర్‌ రొడెరికో ఓఫ్రిన్‌ వ్యాఖ్యానించారు. జనాభా, దేశ విస్తీర్ణాలను పరిగణనలోకి తీసుకొని భారత

కరోనా కట్టడిలో భారత్‌ భేష్‌ : డబ్ల్యూహెచ్‌వో

ముంబై, ఏప్రిల్‌ 3: కరోనా కట్టడికి భారత్‌ చేస్తున్న కృషిని చెప్పడానికి మాటలు చాలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయాసియా ప్రాంతీయ ఎమర్జెన్సీ డైరెక్టర్‌ డాక్టర్‌ రొడెరికో ఓఫ్రిన్‌ వ్యాఖ్యానించారు. జనాభా, దేశ విస్తీర్ణాలను పరిగణనలోకి తీసుకొని భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మహానగరాల నుంచి మారుమూల గ్రామాల దాకా కరోనా వ్యాప్తిజరగకుండా ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న తీరు అద్భుతమన్నారు.

Updated Date - 2020-04-04T06:59:04+05:30 IST