హైదరాబాద్: దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా బారిన పడి 477 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో ప్రస్తుతం 99,763 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా నుంచి 8,546 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,06,541కి చేరింది.