న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో మూడు లక్షలకు పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 3,17,532 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవగా... 491 మంది మృతి చెందారు. అలాగే కొవిడ్ నుంచి కోలుకుని 2,23,990 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19,24,051గా ఉంది. రోజువారి కోవిడ్ పాజిటివ్ రేటు 16.41 శాతంగా నమోదు అయ్యింది. నిన్నటి కంటే నేడు దేశంలో అదనంగా 3.63 శాతం కొవిడ్ కేసులు పెరిగాయి. మరోవైపు భారత్లో ఒమైక్రాన్ కేసుల సంఖ్య 9,287కు చేరింది. ఇప్పటి వరకు 159.67 కోట్ల మంది టీకా తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి