Indiaలో కొత్తగా 2,64,202 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-14T15:45:14+05:30 IST

దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

Indiaలో కొత్తగా 2,64,202 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,64,202 కొత్తగా కోవిడ్ కేసులు నమోదు అవగా... 315 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 1,09,345 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్నటి కేసుల కంటే ఈరోజు 6.7 శాతం అధికంగా కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో ప్రస్తుతం 12,72,073 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 4,85,350గా ఉంది. రోజువారీ కొవిడ్ పాజిటివ్ రేటు 14.78 శాతంగా నమోదు అయ్యింది. మరోవైపు దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 5,753కి చేరింది. 

Updated Date - 2022-01-14T15:45:14+05:30 IST