ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు అండగా నిలిచిన NRIలు

ABN , First Publish Date - 2022-05-01T17:58:55+05:30 IST

ఆస్ట్రేలియా నుంచి స్వగ్రామానికి వస్తూ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రవాసులు అండగా నిలిచారు. ముఖ్యంగా తెలుగు కమ్యూనిటీ ప్రజలు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు. విరాళాల రూపంల వచ్చిన మొత్తాన్ని చిన్నారులకు అందజేయనున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన..

ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు అండగా నిలిచిన NRIలు

ఎన్నారై డెస్క్: ఆస్ట్రేలియా నుంచి స్వగ్రామానికి వస్తూ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రవాసులు అండగా నిలిచారు. ముఖ్యంగా తెలుగు కమ్యూనిటీ ప్రజలు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు. విరాళాల రూపంల వచ్చిన మొత్తాన్ని చిన్నారులకు అందజేయనున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన పెద్దగమళ్ల హేమామ్ బద్రర్ (40), భార్య రమాదేవి (35) కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లారు. అడిలైడ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ.. అక్కడే స్థిరపడ్డారు. ఈ దంపతులకు 9ఏళ్ల కూతురు భవగ్నా, ఆరేళ్ల కొడుకు పల్విత్ ఉన్నారు. కాగా.. ఈ నెల 25నఈ కుటుంబం.. స్వగ్రామానికి వెళ్లే నిమిత్తం.. ఆస్ర్టేలియా నుంచి హైదరాబాద్‌ వచ్చింది. ఒకరోజు స్నేహితుడి ఇంట్లో బసచేసి.. బుధవారం తెల్లవారుజామునే ఏపీలోని స్వగ్రామానికి కారులో బయలుదేరింది. ఈ నేపథ్యంలోనే వేగంగా దూసుకుపోయిన కారు సూర్యపేట జల్లా చివ్వెంల వద్ద రాత్రి 2.30 గంటలకు కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హేమామ్ అతడి భార్య రమాదేవి అక్కడికక్కడే చనిపోగా.. డ్రైవర్‌తో సహా ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. 



ఈ విషయం ఆస్ట్రేలియాలోని తెలుగు కమ్యూనిటీ ప్రజలకు తెలిసి విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారు భవిష్యత్తు, చికిత్స కోసం శివాజీ పాతూరి అనే ప్రవాసుడు GoFundMe విరాళాల సేకరణ ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి పెద్ద మొత్తంలో ఆదరణ లభించింది. సుమారు 1.76లక్షల ఆస్ట్రేలియా డాలర్లు(సుమారు రూ.94లక్షలు) విరాళాల రూపంలో అందాయి. ఈ మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు, చికిత్స కోసం ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. 




Updated Date - 2022-05-01T17:58:55+05:30 IST