ఇండియాకు వెళ్లొద్దు.. ట్రావెల్ అడ్వైజరీలో స్పష్టం చేసిన అమెరికా!

ABN , First Publish Date - 2020-08-08T02:37:40+05:30 IST

అమెరికా ప్రభుత్వం తమ దేశ పౌరుల కోసం తాజాగా సవరించిన ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసింది. అందులో అమెరికన్లు ఎవరూ భారత్‌కు వెళ్లొద్దని సూ

ఇండియాకు వెళ్లొద్దు.. ట్రావెల్ అడ్వైజరీలో స్పష్టం చేసిన అమెరికా!

వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం తమ దేశ పౌరుల కోసం తాజాగా సవరించిన ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసింది. అందులో అమెరికన్లు ఎవరూ భారత్‌కు వెళ్లొద్దని సూచించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా దేశాలన్నీ లాక్‌డౌన్ అయ్యాయి. ఇందులో భాగంగా.. వీదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని చాలా దేశాలు.. ఆంక్షలను సడలిస్తున్నాయి. విదేశీ పౌరులను తమ దేశంలోకి అనుమతిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం గతంలో జారీ చేసిన ట్రావెల్ అడ్వైజరీని సవరించింది. అమెరికా తన పౌరులకు తాజాగా సూచించిన ప్రయాణ మార్గదర్శకాల ప్రకారం.. కరోనా ముప్పు దృష్ట్యా అమెరిన్లు ఎవరూ భారత్‌కు వెళ్లొద్దని తెలిపింది. అమెరికా తాజాగా జారీ చేసిన ట్రావెల్ అడ్వైజరీలో.. భారత్, చైనా సహా మరో 50 దేశాలను లెవల్-4 కేటగిరీలోనే కొనసాగించింది. దీని ప్రకారం.. భారత్, చైనా సహా లెవల్-4 కేటగిరీలో ఉన్న దేశాలకు ప్రయాణం చేయొద్దని.. అమెరికా తన పౌరులకు సూచించింది. లెవల్-4 కేటగిరిలో ఉన్న దేశాలకు అమెరికన్లు వెళ్తే.. అక్కడ సరిహద్దు, విమానాశ్రయాల మూసివేత, ప్రయాణ ఆంక్షలు, స్టే హోం ఆదేశాలతోపాటు ఇతర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. కాగా.. లెవల్-4 కేటగిరీలో భారత్, చైనా, బంగ్లాదేశ్, భూటాన్, సిరియా, రష్యా, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాలు ఉన్నాయి. 


Updated Date - 2020-08-08T02:37:40+05:30 IST