భారత్-చైనా సరిహద్దులో ఇదీ పరిస్థితి.. స్పష్టం చేస్తున్న ఉపగ్రహ చిత్రాలు

ABN , First Publish Date - 2020-06-05T02:24:08+05:30 IST

చైనా బలగాలు గత నెలలో లడక్ సెక్టార్‌లోని మూడు ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయడంతో గత నెలలో

భారత్-చైనా సరిహద్దులో ఇదీ పరిస్థితి.. స్పష్టం చేస్తున్న ఉపగ్రహ చిత్రాలు

న్యూఢిల్లీ: చైనా బలగాలు గత నెలలో లడక్ సెక్టార్‌లోని మూడు ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా బరితెగింపుపై వెంటనే తేరుకున్న భారత్ బలగాలను సరిహద్దుకు తరలించి చైనా ప్రయత్నాలను తిప్పికొట్టింది. తాజాగా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద కూడా మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. భారత్-చైనా దళాల మధ్య ప్రస్తుతం 2.5 కిలోమీటర్ల దూరం ఉన్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల సైనికులు వారి వారి భూభాగాల్లో మకాం వేశారు. గాల్వన్ నదీ లోయ ప్రాంతంలో ఇరు దేశాల బలగాలు దూరం పాటిస్తున్నట్టు సమాచారం. గాల్వన్ నదీ లోయలో సైనికులు ఇప్పటికే తమ భూభాగాల్లోని శిబిరాలకు చేరుకున్నట్టు చిత్రాల్లో కనిపిస్తోంది. కాగా, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఈ నెల 6న లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో చర్చలు జరిగే అవకాశం ఉంది.

Updated Date - 2020-06-05T02:24:08+05:30 IST