Ladakh: త్వరలో భారత్, చైనా మిలిటరీ అధికారుల సమావేశం

ABN , First Publish Date - 2021-07-23T02:49:08+05:30 IST

తూర్పు లద్దాఖ్ సరిహద్దులో ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్, చైనా మిలిటరీ అధికారులు మరోమారు సమావేశం కానున్నారు. ఇప్పటివరకూ 11 పర్యాయాలు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ మారు జులై 26న సమావేశమవుదామని చైనా ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే..

Ladakh: త్వరలో భారత్, చైనా మిలిటరీ అధికారుల సమావేశం

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్ సరిహద్దులో ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్, చైనా మిలిటరీ అధికారులు మరోమారు సమావేశం కానున్నారు. ఇప్పటివరకూ 11 పర్యాయాలు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ మారు జులై 26న సమావేశమవుదామని చైనా ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే.. ఆ రోజు కార్గిల్ దివస్ కావడంతో సమావేశం కుదరదని భారత్ చెప్పినట్టు తెలుస్తోంది. మరో తేదీని సూచించాలని కూడా చైనాను భారత్ కోరిందని విశ్వసనీయ వర్గాల కథనం. ఈ నేపథ్యంలో ఇరు దేశాలూ చర్చల కోసం మరో తేదీని ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాయి. అతి త్వరలోనే ఈ సమావేశం జరుగుతుందని తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌లోని దెప్సాంగ్ మైదానాలు, గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలను తొలగించడంపై ఇరు దేశాల మిలిటరీ అధికారులు ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా.. ఇరు దేశాలు ఒకేసారి తమ దళాలను వెనక్కు పిలిపించుకుంటేనే ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయని భారత్ ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసింది. 

Updated Date - 2021-07-23T02:49:08+05:30 IST