నిబంధనలు సవరించిన భారత్! ఎట్-రిస్క్ దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు ఇకపై..

ABN , First Publish Date - 2022-01-22T01:58:42+05:30 IST

ఎప్పటికప్పుడు మారుతున్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి తాజాగా కొన్ని కీలక మార్పులు చేసింది.

నిబంధనలు సవరించిన భారత్! ఎట్-రిస్క్ దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు ఇకపై..

న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు మారుతున్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి తాజాగా కొన్ని కీలక  మార్పులు చేసింది. ఇకపై ఎట్-రిస్క్ దేశాలు(కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలు) నుంచి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఐసోలేషన్ తప్పనిసరి కాదని పేర్కొంది. అంతేకాకుండా.. ఈ దేశాల ప్రయాణికులు కరోనా పాజిటివ్‌గా తేలిన పక్షంలో వారి నుంచి సేకరించిన శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ నిమిత్తం ఐఎన్ఎస్ఏసీఓజీ నెట్వర్క్ పరిధిలోని లాబొరేటరీలకు పంపాలని కేంద్రం తన తాజాగా మార్గదర్శకాల్లో పేర్కొంది. రేపటి(జనవరి 22) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 

Updated Date - 2022-01-22T01:58:42+05:30 IST