జనవరి 31 వరకు అంతర్జాతీయ విమానాలు బంద్.. ఆ సర్వీసులు మాత్రం యథాతథం!

ABN , First Publish Date - 2021-12-10T13:05:19+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. అంతర్జాతీయ విమాన సర్వీసు (షెడ్యూల్డ్‌ ఫ్లైట్స్‌)ల సస్పెన్షన్‌ను జనవరి 31వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. గురువారం ఈ మేరకు పౌర విమాన యాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) ఉత్తర్వులిచ్చారు. కొవిడ్‌ వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో గత నెల చివరలో అంతర్జాతీయ...

జనవరి 31 వరకు అంతర్జాతీయ విమానాలు బంద్.. ఆ సర్వీసులు మాత్రం యథాతథం!

న్యూఢిల్లీ, డిసెంబరు 9: ప్రపంచవ్యాప్తంగా ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. అంతర్జాతీయ విమాన సర్వీసు (షెడ్యూల్డ్‌ ఫ్లైట్స్‌)ల సస్పెన్షన్‌ను జనవరి 31వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. గురువారం ఈ మేరకు పౌర విమాన యాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) ఉత్తర్వులిచ్చారు. కొవిడ్‌ వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో గత నెల చివరలో అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం డిసెంబరు 15 నుంచి నిర్ణయం అమల్లోకి రావాల్సి ఉంది. ఒమైక్రాన్‌ వేరియంట్‌ బయటపడడంతో ఈ నెల 1న నిర్ణయాన్ని వెనక్కుతీసుకుంది. కొవిడ్‌ కారణంగా గతేడాది మార్చి 23 నుంచి భారత్‌ అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. 2020 మే నుంచి వందేభారత్‌ మిషన్‌ కింద ప్రత్యేక సర్వీసులను, జూలై నుంచి ‘ఎయిర్‌ బబుల్‌’ ఒప్పందం ఉన్న  దేశాలకు సర్వీసులను కొనసాగిస్తోంది. ప్రస్తుతం 32 దేశాలతో ‘ఎయిర్‌ బబుల్‌’ ఒప్పందం ఉంది.

Updated Date - 2021-12-10T13:05:19+05:30 IST