సౌతాఫ్రికాపై కోహ్లీ సేన ఘన విజయం

ABN , First Publish Date - 2021-12-30T22:07:17+05:30 IST

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్‌లోని సూపర్‌ స్పోర్ట్ పార్క్‌లో దక్షిణాఫ్రికతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు..

సౌతాఫ్రికాపై కోహ్లీ సేన ఘన విజయం

సెంచూరియన్: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్‌లోని సూపర్‌ స్పోర్ట్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 305 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 191 పరుగులకు ఆలౌటై పరాజయం పాలైంది. 


ఓవర్‌నైట్ స్కోరు 94/4తో ఐదో రోజైన నేడు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీలు భారత బౌలర్లను ఎదుర్కోవడంలో తడబడ్డారు. ముఖ్యంగా బుమ్రా, షమీ దెబ్బకు వికెట్లు సమర్పించుకుని పెవిలియన్ చేశారు. కెప్టెన్ డీన్ ఎల్గర్ 77 పరుగులు చేయగా, తెంబా బవుమా 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వికెట్ కీపర్ డికాక్ చేసిన 21 పరుగులే వీరి తర్వాత అత్యధికం కావడం గమనార్హం. భారత బౌలర్లలో బుమ్రా, షమీ చెరో మూడు వికెట్లు తీసుకోగా, సిరాజ్, అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 


అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేయగా, సౌతాఫ్రికా 197 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా దక్షిణాఫ్రికా ఎదుట 305 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. రెండో ిఇన్నింగ్స్‌లో తబడిన సఫారీలు భారత బౌలింగును ఎదుర్కోలేక చేతులెత్తేశారు.

Updated Date - 2021-12-30T22:07:17+05:30 IST