ఇరాన్ నుంచి Kiwi fruits దిగుమతిపై నిషేధం

ABN , First Publish Date - 2021-12-14T18:05:53+05:30 IST

ఇరాన్ దేశం నుంచి కివీ పండ్ల దిగుమతిని భారత ప్రభుత్వం నిషేధించింది....

ఇరాన్ నుంచి Kiwi fruits దిగుమతిపై నిషేధం

న్యూఢిల్లీ: ఇరాన్ దేశం నుంచి కివీ పండ్ల దిగుమతిని భారత ప్రభుత్వం నిషేధించింది. తెగుళ్లు సోకిన కివీ పండ్లు ఇరాన్ దేశం నుంచి దిగుమతి అవుతుండటంతో భారతదేశం దీన్ని నిషేధించింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి భారతదేశంలో 22 సరుకుల్లో తెగులు వచ్చింది. ఇరాన్ నుంచి తెగులు దేశంలోకి వస్తుండటంతో కేంద్ర వ్యవసాయమంత్రిత్వశాఖ ఆధీనంలోని నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ ఈ నెల 7వతేదీ నుంచి కివీ పండ్ల దిగుమతిని నిషేధించింది. కివీ పండ్లను తమ దేశానికి పంపించవద్దని భారత్ ఇరాన్ సర్కారుకు తెలిపింది. కివీ పండ్ల ద్వారా తెగులు దేశంలోకి వస్తుందని పలుసార్లు భారత్ ఇరాన్ దేశానికి హెచ్చరికలు చేసింది. 


అయినా ఇరాన్ పట్టించుకోక పోవడంతో దిగుమతులపై భారత్ నిషేధాస్త్రం విధించింది. భారతదేశం 4,000 టన్నుల కివీ పండ్లను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కివీ పండ్ల దిగుమతిపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించడంతో దేశంలో దీని ధరలు ఆకాశన్నంటనున్నాయి.

Updated Date - 2021-12-14T18:05:53+05:30 IST