India - Australia match: జింఖానా గ్రౌండ్‌ తొక్కిసలాటపై శ్రీనివాస్‌గౌడ్ ఫైర్

ABN , First Publish Date - 2022-09-22T21:46:24+05:30 IST

భారత్‌ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ (India - Australia match) టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు (Cricket fans) ఎగబడటంతో జింఖానా గ్రౌండ్ దగ్గర తొక్కిసలాట

India - Australia match: జింఖానా గ్రౌండ్‌ తొక్కిసలాటపై శ్రీనివాస్‌గౌడ్ ఫైర్

హైదరాబాద్: భారత్‌ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ (India - Australia match) టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు (Cricket fans) ఎగబడటంతో జింఖానా గ్రౌండ్ దగ్గర తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాటపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (minister srinivas goud) మండిపడ్డారు. టికెట్ల విక్రయంలో హెచ్‌సీఏ (HCA) పూర్తిగా విఫలమైందని తప్పుబట్టారు. హైదరాబాద్ బ్రాండ్‌ను డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టికెట్ల అమ్మకం బాధ్యత హెచ్‌సీఏదేనని స్పష్టం చేశారు. HCA ప్రైవేట్ సంస్థ.. లా అండ్ ఆర్డర్‌కు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. కరోనా తర్వాత జరుగుతున్న మ్యాచ్ కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగితే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.


భారత్‌ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్ దగ్గర ఉన్న హెచ్‌సీఏ కార్యాలయం దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు అభిమానులు, పోలీసులకు గాయాలయ్యాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే అభిమానులు టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ వద్ద క్యూ కట్టారు. టికెట్ల కోసం పెద్దఎత్తున క్రికెట్‌ అభిమానులు అక్కడికి తరలివచ్చారు. దీంతో అభిమానులను పోలీసులు నియంత్రించలేపోయారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో పలువురు అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. అలాగే పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. జింఖానా గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో హెచ్‌సీఏ టికెట్ కౌంటర్లను మూసివేసింది.

Updated Date - 2022-09-22T21:46:24+05:30 IST