హెచ్‌సీక్యూ: 25 దేశాల అభ్యర్థనలను మన్నించిన భారత్

ABN , First Publish Date - 2020-04-10T16:25:19+05:30 IST

కరోనా కల్లోలం నేపథ్యంలో మలేరియా నిరోధక ఔషధం హైడ్రాక్సీక్లోరోక్వీన్ (హెచ్‌సీక్యూ) కోసం ఇప్పటి...

హెచ్‌సీక్యూ: 25 దేశాల అభ్యర్థనలను మన్నించిన భారత్

న్యూఢిల్లీ: కరోనా కల్లోలం నేపథ్యంలో మలేరియా నిరోధక ఔషధం హైడ్రాక్సీక్లోరోక్వీన్ (హెచ్‌సీక్యూ) కోసం ఇప్పటి వరకు 25 దేశాల నుంచి వచ్చిన అభ్యర్థనలను అంగీకరించినట్టు అధికారులు వెల్లడించారు. పూర్తిస్థాయిలో స్టాక్ సమకూరిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అమెరికా సహా ఇప్పటి వరకు 30 దేశాలు ఈ డ్రగ్ కోసం అభ్యర్థించినట్టు సమాచారం. కాగా అనుమతించిన 25 దేశాలకు హెచ్‌సీక్యూతో పాటు, పారాసిటమాల్ మాత్రలు కూడా పంపేందుకు ప్రభుత్వం అంగీకరించింది.


ఈ మాత్రల కోసం కేవలం దౌత్య మార్గాల ద్వారా మాత్రమే కాక ఆయా దేశాల అధినేతలు స్వయంగా ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేసి అభ్యర్థించడం విశేషం. తమ విజ్ఞప్తిని మన్నించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ ఎం బోల్సనారో తదితరులు ఫోన్ చేసి మోదీకి ధన్యవాదాలు తెలిపారు. యూకే సైతం పారాసిటమాల్ మాత్రలు పంపినందుకు భారత్‌కు ధన్యవాదాలు తెలిపింది. కోవిడ్-19 చికిత్సలో హెచ్‌సీక్యూ ‘గేమ్ చేంజర్’ లాంటిదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-04-10T16:25:19+05:30 IST