వ్యాక్సినేషన్‌లో 150 కోట్లు దాటేశాం!

ABN , First Publish Date - 2022-01-08T01:20:03+05:30 IST

న్యూఢిల్లీ: జాతీయ ఉచిత టీకాకరణలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 150 కోట్ల వ్యాక్సిన్లు పూర్తి చేశారు.

వ్యాక్సినేషన్‌లో 150 కోట్లు దాటేశాం!

న్యూఢిల్లీ: జాతీయ ఉచిత టీకాకరణలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 150 కోట్ల వ్యాక్సిన్లు పూర్తి చేశారు. అర్హులైన పెద్దల్లో 90శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదే సమయంలో 18 ఏళ్ల లోపు వారికి ఇప్పటికే కోటిన్నర మందికి టీకాలు వేశామంటూ కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి మన్సుక్ మాండవీయ ట్వీట్ చేశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ఇంకా వినియోగించని 18 కోట్లకు పైగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. 



Updated Date - 2022-01-08T01:20:03+05:30 IST