ఐరాస అత్యవసర సమావేశం.. ఓటింగ్‌కు భారత్‌ దూరం

ABN , First Publish Date - 2022-02-28T20:46:35+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) అత్యవసరంగా..

ఐరాస అత్యవసర సమావేశం.. ఓటింగ్‌కు భారత్‌ దూరం

ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) అత్యవసరంగా సమావేశమవుతోంది. ఉక్రెయిన్‌పై దాడిని ఖండిస్తూ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని ఇప్పటికే రష్యా తన వీటో అధికారంతో అడ్డుకోగా, ఇదే అంశంపై చర్చిచేందుకు 199 సభ్య దేశాలున్న ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. ఈ మేరకు 15 సభ్యదేశాలు భధ్రతా మండలి ఓటింగులో పాల్గొని నిర్ణయం తీసుకోగా, భారత్ ఈ ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉంది. రష్యా సైనిక చర్చను ఖండిస్తూ భద్రతా మండలిలో చేసిన తీర్మానానికి కూడా రెండ్రోజుల క్రితం భారత్ గైర్హాజరైంది. ఐరాస 1950లో ఏర్పడిన తర్వాత అంటే గత ఏడు దశాబ్దాల్లో ఇలాంటి అసాధారణ, అత్యవసర సమావేశాలు నిర్వహించడం ఇది పదకొండవది. కాగా, ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్నప్పటికీ, బెలారస్ సరిహద్దులో చర్చలు జరపాలని మాస్క్, కీవ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది.



Updated Date - 2022-02-28T20:46:35+05:30 IST