సౌతాఫ్రికా ‘ఎ’తో భారత్‌ ‘ఎ’ అనధికార టెస్టు డ్రా

ABN , First Publish Date - 2021-12-04T08:44:57+05:30 IST

దక్షిణాఫ్రికా ‘ఎ’తో రెండో అనధికార టెస్టులో భారత్‌ ‘ఎ’ విజయాన్ని వెలుతురు లేమి అడ్డుకుంది. దాంతో నాలుగు రోజుల ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

సౌతాఫ్రికా ‘ఎ’తో భారత్‌ ‘ఎ’ అనధికార టెస్టు డ్రా

బ్లూమ్‌ఫోంటీన్‌: దక్షిణాఫ్రికా ‘ఎ’తో రెండో అనధికార టెస్టులో భారత్‌ ‘ఎ’ విజయాన్ని వెలుతురు లేమి అడ్డుకుంది. దాంతో నాలుగు రోజుల ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 234 టార్గెట్‌తో ఆఖరిరోజైన శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన భారత్‌.. 42 ఓవర్లలో 155/3 స్కోరుతో పటిష్ఠస్థితిలో నిలిచింది. అప్పటికి 20కిపైగా ఓవర్లు ఉండగా..79 రన్స్‌ చేయాలి. ఈ దశలో వెలుతురు లేకపోవడంతో మ్యాచ్‌ను నిలిపేసి డ్రాగా ప్రకటించారు. విహారి (72 నాటౌట్‌) సత్తా చాటాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 116/5తో చివరిరోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా 212 రన్స్‌కు ఆలౌటైంది.  ఆ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 297, భారత్‌ 276 రన్స్‌ చేశాయి. 

Updated Date - 2021-12-04T08:44:57+05:30 IST