monkeypox : భారత్‌లో తొలి మంకీపాక్స్ మరణం.. ఎక్కడ నమోదయ్యిందంటే..

ABN , First Publish Date - 2022-08-01T02:23:55+05:30 IST

భారత్‌లో (India) తొలి మంకీపాక్స్(monkeypox) మరణం(Death) నమోదయ్యింది. కేరళ(Kerala)లోని త్రిసూర్ జిల్లా పున్నియార్‌లో 22 ఏళ్ల యువకుడు వైరస్‌తో చనిపోయాడు.

monkeypox : భారత్‌లో తొలి మంకీపాక్స్ మరణం.. ఎక్కడ నమోదయ్యిందంటే..

న్యూఢిల్లీ : భారత్‌లో (India) తొలి మంకీపాక్స్(monkeypox) మరణం(Death) నమోదయ్యింది. కేరళ(Kerala)లోని త్రిసూర్ జిల్లా పున్నియార్‌లో 22 ఏళ్ల యువకుడు వైరస్‌తో చనిపోయాడు. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీనా జార్జ్ (Veena George) ఆదివారం ఒక ప్రకటన చేశారు. మృతి చెందిన యువకుడు యూఏఈ(United Arab Emirates) నుంచి జులై 22న భారత్ వచ్చాడు. ఇక్కడికి రావడానికి ఒక్కరోజు ముందే పరీక్షలు నిర్వహించగా.. అక్కడే మంకీపాక్స్ నిర్ధారణ అయ్యిందని మంత్రి చెప్పారు. మంకీపాక్స్ కేసుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆమె వివరించారు. కాగా ఈ మరణానికి సంబంధించిన రిపోర్టును అలప్పూజలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఆదివారం రాత్రి లేదా సోమవారం విడుదల చేసే అవకాశాలున్నాయి. మరోవైపు దేశంలో ఇప్పటివరకు మొత్తం 4 మంకీపాక్స్ కేసులు నమోదవ్వగా అందులో 3 కేరళలోనే నమోదవ్వడం గమనార్హం.


ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది జులై 22 నాటికి ప్రపంచవ్యాప్తంగా 16,016 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. అయితేనప్పటికీ 75 దేశాల్లో కేవలం 5 మరణాలే నమోదయ్యాయి. ఆఫ్రికా వెలుపల స్పెయిన్, బ్రెజిల్‌ దేశాల్లో తొలి మరణాలు రికార్డ్ అయ్యాయి.

Updated Date - 2022-08-01T02:23:55+05:30 IST