అమరుల త్యాగఫలమే స్వతంత్ర భారతం

ABN , First Publish Date - 2022-08-15T05:17:48+05:30 IST

అమరవీరుల త్యాగఫలమే స్వతంత్ర భారతమని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్‌ పేర్కొన్నారు.

అమరుల త్యాగఫలమే స్వతంత్ర భారతం
గాయత్రి టవర్స్‌పై జెండా ఆవిష్కరిస్తున్న శ్రీనివాసరెడ్డి

ఘనంగా హర్‌ఘర్‌ తిరంగాలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి

కడప, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): అమరవీరుల త్యాగఫలమే స్వతంత్ర భారతమని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్‌ పేర్కొన్నారు. కడప నగరంలో ని శ్రీనివాసరెడ్డి, కడప నియోజకవ ర్గం ఇన్‌చార్జ్‌ అమీర్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌ నివాసాల వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎగురేశారు. ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన వారు మాట్లాడుతూ భారత జా తి పట్ల అంకిత భావంతో పని చేయాలన్నా రు. మహనీయులు సాధించిపెట్టిన స్వతంత్ర భారత దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్య త ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.  

అమీర్‌బాబు నివాసంలో...

 నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ అమీర్‌బాబు నివాసం, 26వ డివిజన్‌లో ఎన్‌ఆర్‌ఐ షేక్‌ రహ్మతుల్లా నివాసం వద్ద జాతీయ జెండాను అమీర్‌బాబుతో కలిసి టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. రహ్మతుల్లా కుమారుడు షేక్‌ ఇర్ఫాన్‌తో కలిి స టీడీపీ నేతలు జాతీయ గీతం పాడారు. 

హరిప్రసాద్‌ నివాసం వద్ద....

 హర్‌ఘర్‌ తిరంగాలో భాగంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్‌ నివాసం వద్ద జెండా ఎగురవేశా రు. తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు శ్రేణులకు పిలుపునివ్వడంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. కార్యక్రమాల్లో జిల్లా ప్ర ధాన కార్యదర్శి వికా్‌సహరికృష్ణ, నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి,   పశ్చిమ పట్టభద్రుల అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డి, మాజీ నగర అధ్యక్షుడు జిలానిబాష, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర కార్యదర్శి మాసాపేట శివ, ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొమ్మలపాటి సు బ్బరాయడు, వాణిజ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానపురెడ్డి రవిశంకర్‌రెడ్డి తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి అమర్‌నాథ్‌రెడ్డి, తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు సునీత రాయల్‌, నగర ఉపాధ్యక్షురాలు వరద పార్వతి, మాజీ ప్రభుత్వ న్యాయవాది గడ్డ గుర్రప్ప, బీసీ నేత యాటగిరి రాంప్రసాద్‌, బాలిశెట్టి వినయ్‌, ఎంపీ సురేష్‌, రవిశంకర్‌రెడ్డి, గన్నేపాటి మల్లేష్‌, సుబ్బరాయుడు, అఫ్జల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-15T05:17:48+05:30 IST