అందరి భాగస్వామ్యంతో జిల్లా ప్రగతిపథం

ABN , First Publish Date - 2022-08-16T07:28:24+05:30 IST

రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు15: ‘అందరి భాగస్వామ్యంతో జిల్లా ప్రగతిపథంలో పయనిస్తోంది. ఎందరో మహనీయులు, దేశభక్తులు తమ వీరోచిత పోరాటాల త్యాగాలు వారి ఆశయాల బాటలో కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి పునరంకితం కావాల ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

అందరి భాగస్వామ్యంతో జిల్లా ప్రగతిపథం
స్వాతంత్య్ర వేడుకల్లో త్రివర్ణ బెలూన్లు ఎగురవేస్తున్న దృశ్యం

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు

దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి

స్వాతంత్య్ర దినోత్సవంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వేణు

ప్రభుత్వ ఆర్ట్సు కళాశాల మైదానంలో ఘనంగా వేడుకలు 


రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు15: ‘అందరి భాగస్వామ్యంతో జిల్లా ప్రగతిపథంలో పయనిస్తోంది. ఎందరో మహనీయులు, దేశభక్తులు తమ వీరోచిత పోరాటాల త్యాగాలు వారి ఆశయాల బాటలో కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి పునరంకితం కావాల ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్సు కళాశాల మైదానంలో 76వ స్వాతంత్య్ర వేడుకల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టర్‌ కె.మాధవీలత, ఎస్పీ ఐశ్వర్త రస్తోగీ, నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.దినేష్‌కుమార్‌, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జిల్లా న్యాయమూర్తులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి వేణు పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ చారిత్రాత్మక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన రాజమహేంద్రవరం రాష్ట్రంలోనే విశిష్టమైన సాంస్కృతిక రాజధానిగా స్థానం పొందిందన్నారు. ఆదికవి నన్నయ, సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం, ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం వంటి ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, సాహితీవేత్తలకు రాజమహేంద్రవరం కేంద్రం గా ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లుగా జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో రైతు సంక్షేమమే లక్ష్యంగా ఇప్పటివరకూ 1 లక్షా 22 వేల మంది రైతు కుటుంబాలకు రూ.90 కోట్ల 55 లక్షలు, వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాలు గా 24 వేల మంది రైతులకు రూ.5 కోట్ల 51 లక్షలు అందించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో రూ.470 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాల 2023-24 నాటికి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని, దీనిద్వారా 150 మెడికల్‌ ఎంబీబీఎస్‌ సీట్లు వస్తాయని తెలిపారు. కలెక్టర్‌, ఎస్పీ తదితర అధికారులు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ మాధవీలత, జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ, నగర కమిషనర్‌ కె.దినేష్‌కుమార్‌ పాల్గొన్నారు. 


శకటాల ప్రదర్శన

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంఽధించిన శకటాలను ప్రదర్శించారు. అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, మార్కెటింగ్‌శాఖ శకటం, డ్వామా, పంచాయతీరాజ్‌ శాఖ శకటం, హౌసింగ్‌ అండ్‌ ఏపీ టిడ్కో, డీఆర్‌డీఏ, ఐసీడీఎస్‌, ఎడ్యుకేషన్‌ - నాడు నేడు, ఫైర్‌, రెవెన్యూ, సివిల్‌ సప్లయి, ఆర్‌డబ్ల్యుఎస్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, దిశ పోలీస్‌ శకటాలు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని శాఖల వాహనాలకు ధ్రువీకరణ పత్రాలను మంత్రి అందజేశారు. పుంగనూరు జాతి, ఒంగోలు జాతి గిత్తల ఎడ్ల బండ్లు ఆకర్షణగా నిలిచాయి. 


అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

జాతీయభావం స్ఫురించేలా నగరపాలక సంస్థ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహం, డీఐ ఆఫ్‌ స్కూల్స్‌ దిలీప్‌కుమార్‌ పర్యవేక్షణలో నిర్వహించారు.


పురస్కారాలు.. ప్రశంసలు

ప్రశంసాపత్రాలు అందుకున్న జిల్లా అధికారులు వీరే

రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా అధికారులకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మెరిట్‌ సర్టిఫికెట్లు అందజేశారు. సోమవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా పలువురు జిల్లా అధికారులు ప్రశంసాపత్రాలు, సర్టిఫికెట్లు అందుకున్నారు. సర్టిఫికెట్లు అందుకున్నవారిలో.. నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.దినేష్‌కుమార్‌, జిల్లా రెవెన్యూ అధికారి బి.సుబ్బారావు, ఆర్డీవో ఏ.చైత్రవర్షిణీ, కొవ్వూరు ఆర్డీ వో ఎస్‌.మల్లిబాబు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌.మాధవరావు, పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌టీజీ సత్యగోవింద్‌, ఏపీటీఐడీసీఓ జి.నాగేశ్వరి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ డి.బాలశంకరరావు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సనత్‌కుమారి, డిస్ర్టిక్లు చైల్డు డెవలప్‌మెంట్‌ అధికారిణి కె.విజయకుమారి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఎస్‌పీవీ రెడ్డి, స్పోర్ట్సు అథారిటీ చీఫ్‌ కోచ్‌ డీఎంఎం శేషగిరి, డీపీవో జేఎస్‌ నారాయణ, డీఆర్‌డీఏ ఎస్‌సీఆర్‌పీ ఎస్‌.డేగలయ్య, డీడబ్ల్యుఏఎం ఏపీడీ పి.జగదాంబ, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహాం, ఫైర్‌ డిపార్టుమెంట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, ఫిషరీస్‌ జేడీ వి.కృష్ణారావు, హార్టికల్చర్‌ ఆఫీసర్‌ వి.రాధాకృష్ణ, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ ఏబీవీ ప్రసాద్‌, ప్లానింగ్‌ డిపార్టుమెంట్‌ సీపీఓ కే.ప్రకాష్‌రావు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ కేఎన్‌ జ్యోతి, ఏపీపీసీబీ కె.వెంకటేశ్వరరావు, డిస్ర్టిక్టు సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డు అధికారి పి.లక్ష్మణరావు, డిస్ర్టిక్టు హౌసింగ్‌ ఆఫీసర్‌ బి.తారాచంద్‌, డివిజనల్‌ పీఆర్‌ఓ ఎం.లక్ష్మణాచార్యులు అవార్డులు అందుకున్నారు. కలెక్టర్‌, ఎస్పీలు పాల్గొన్నారు.


ఎస్పీ కార్యాలయంలో పురస్కారాలు అందజేత

రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న పలువురు అధికారులు, సిబ్బందికి ఉత్తమ పురస్కారాలు అం దించారు. ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్స్‌లో జరిగిన ఈ వేడుకలో బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎస్పీ ఐశ్వర్యరస్తోగి చేతుల మీదుగా వీటిని అందజేశారు. పురస్కారాలు అందుకున్న వారిలో.. అడిషల్‌ ఎస్పీ సీహెచ్‌ పాపారావు, ఎస్పీ సీసీ ఎం సునీల్‌, సౌత్‌ డీఎస్పీ ఎం శ్రీలత, టూటౌన్‌ సీఐ ఆర్‌ విజయకుమార్‌, ధవళేశ్వరం సీఐ కె మంగాదేవి, వన్‌టౌన్‌ సీఐ ఎఎన్‌ఎన్‌ మూర్తి, దేవరపల్లి సీఐ ఎ శ్రీనివాసరావు, రాజానగరం సీఐ ఎంవీ సుభాష్‌, దిశ స్టేషన్‌ సీఐ గౌస్‌బేగ్‌, ట్రాఫిక్‌ సీఐ కేఎన్‌ మోహన్‌రెడ్డి, రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ పి సంజీవ్‌కుమార్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఎస్‌ఐ డి సమర్పణరావు, ఎఆర్‌ కానిస్టేబుల్‌ కె సోమశేఖర్‌లు ఉన్నారు. వారికి ఎస్పీ రస్తోగి అభినందనలు తెలియజేశారు.

Updated Date - 2022-08-16T07:28:24+05:30 IST