ఉరితాళ్లు ముద్దాడిన..మన్యం వీరులు

ABN , First Publish Date - 2022-08-14T05:30:00+05:30 IST

బ్రిటిష్‌ పాలకులను గడగడలాడించి దేశ స్వాతంత్య్రం కోసం ఉరితాడును ముద్దాడిన ఎందరో మన్యం పోరాటయోధుల త్యాగాలు నేటికీ వెలుగులోకి రాకుండా మరుగునపడటం విచారకరం.

ఉరితాళ్లు ముద్దాడిన..మన్యం వీరులు

 వెలుగులోకి రాని కుర్ల వెంకట సుబ్బారెడ్డి, సీతారామయ్య , ఇంకొందరి త్యాగాలు


బుట్టాయగూడెం, ఆగస్టు 14: బ్రిటిష్‌ పాలకులను గడగడలాడించి దేశ స్వాతంత్య్రం కోసం ఉరితాడును ముద్దాడిన ఎందరో మన్యం పోరాటయోధుల త్యాగాలు నేటికీ వెలుగులోకి రాకుండా మరుగునపడటం విచారకరం. ప్రథమార్థంలోనే బ్రిటిష్‌ వారిని ఎదురించిన మన్యం వీరులు చాలా మందే పశ్చిమ ఏజెన్సీలో ఉన్నారు. ఇందులో పోలవరం తాలూకా కొరు టూరుకు చెందిన కారుకొండ సుబ్బారెడ్డి ప్రఽథముడు. అలాగే కొండమొదలుకు చెందిన కుర్ల సీతారామయ్య, కుర్ల వెం కట సుబ్బారెడ్డి, గురు గుంట్ల కొమ్మిరెడ్డి ఉరితాళ్లకు బలైనవారే. వీరిలో సుబ్బారెడ్డినే బ్రిటిష్‌వారు టార్గెట్‌ చేశారు. ఇప్పుడు పిలవబడే పోలవరం, బుట్టాయగూడెం మండల ప్రాంతాల్లోని 20 పరగణాల ప్రాం తాలను బ్రిటిష్‌ వారికి సమాంతరంగా సుబ్బారెడ్డి కుటుంబీకులు పాలన సాగించేవారు. వ్యవసాయ కుటుంబం నేపథ్యం ఉన్న వీరు అన్ని రకాల పన్నులు వసూలుచేసి ప్రజల అవసరాలను తీరుస్తూ ఉండేవారు. సుబ్బారెడ్డి కుటుంబీకుల పాలనలో ఉన్న ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని బ్రిటిష్‌వారు ప్రయత్నించినా.. యుక్తవయస్సులో దేశభక్తి మెండుగా ఉన్న సుబ్బారెడ్డి తన అనుచరులతో కలిసి వారిని ఎదురించాడు. దీంతో పగబట్టిన బ్రిటిష్‌వారు సుబ్బారెడ్డిని పట్టుకుని ఉరి తీయడానికి ఆదివాసీలనే లోబ ర్చుకునేందుకు పన్నాగం పన్నారు. విచిత్ర మేమిటంటే ఇతనికి అత్యంత సన్నిహితుడే సుబ్బారెడ్డి మరణానికి కారకుడయ్యాడు. సుబ్బారెడ్డిని పట్టించిన వారికి అప్పట్లో 500 నుంచి 2500 రూపాయలు రివార్డు ఇస్తామని బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రకటించిందంటే ఆయన పోరాట స్ఫూర్తి ఎలాంటిదో నేటితరం గుర్తుంచుకోవాలి.  లొంగిపోయిన చింతపల్లికి చెందిన వేట్ల దాసిరెడ్డి ద్వారా ఆచూకీ తెలుసుకుని సుబ్బారెడ్డిని పట్టుకుని ప్రస్తుతం బుట్టా యగూడెం మండల కేంద్రంలో బ్రిటిష్‌ వారు నిర్మించిన జైలులో బంధించారు. 1858 అక్టోబర్‌ ఏడో తేదీన సుబ్బారెడ్డి, కుర్ల సీతారామయ్య, తూటిగుంటలో కుర్ల వెంకట సుబ్బారెడ్డి, పాత పోలవరం దివానం వద్ద గురు గుంట్ల కొమ్మిరెడ్డిను బ్రిటిష్‌ పాలకులు ఉరి తీసినట్టు చరిత్ర చెబుతోంది.  చరిత్ర ఆధారాలు లేకపోయినా సుబ్బారెడ్డి తలను రాజమండ్రి కోటగుమ్మానికి వేలాడ దీశారనే కథనాలూ ఉన్నాయి. మొండెంను మాత్రం కుటుంబ సభ్యులకు ఇవ్వకుండానే బ్రిటిష్‌వారు దహనం చేశారని చరిత్ర ఆధారాలు లేకపోలేదు. ప్రముఖ బ్రిటిష్‌ ఛానల్‌ బీబీసీ 1858 నాటి స్వాతంత్య్ర పోరా టంపై సర్వే చేయగా కోరుకొండ సుబ్బారెడ్డితోపాటు మరికొం దరి పోరాటాలు, మరణ విషయాలు బహి ర్గతమైనట్టు వెలుగులోకి వచ్చాయి. సూర్యుడస్తమించని బ్రిటిష్‌ సామ్రా జ్యాన్ని గడగడలాడించిన ఆదివాసీ పోరాటయోధుడు సుబ్బారెడ్డి నాల్గో తరానికి చెందిన పూర్వీకులు నేటికీ ఉన్నారు. సుబ్బారెడ్డి మునిమనవడు కోరుకొండ అబ్బాయిరెడ్డి ప్రస్తుతం జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం వద్ద పోలవరం నిర్వాసితులకు నిర్మించిన పునరావాస కాలనీలో ఉంటున్నాడు. అబ్బాయిరెడ్డి అల్లుడు బోనపు శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు అక్కడే ఉంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాత కొరుటూరు మునిగి పోవడం వల్ల వారంతా ఇక్కడకు వచ్చారు. విచిత్రమేమిటంటే సుబ్బారెడ్డి గురించి వీరికి ఒక్క విషయం కూడా తెలీదు. గ్రామంలో పాతతరం వారు తమ పూర్వీకులు పోరాట యోధులు అంటుంటే వినేవారమే తప్పా.. తెలియదని చెప్పారు.


Updated Date - 2022-08-14T05:30:00+05:30 IST