స్వాతంత్రోద్యమంలో అమరులు

ABN , First Publish Date - 2022-08-12T05:13:01+05:30 IST

స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ఎనిమిది మంది అమరులయ్యారు.

స్వాతంత్రోద్యమంలో అమరులు


 స్వదేశం కోసం ఎనిమిది మంది కన్నుమూత

ఏలూరుసిటీ, ఆగస్టు 11: స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ఎనిమిది మంది అమరులయ్యారు. వీరిలో దండు నారాయణరాజు 1944వ సంవత్సరం సెప్టెంబర్‌ 10వ తేదీన తిరుచునాపల్లి జైలులో మరణించగా, సత్యవాడకు చెందిన ఇందుకూరి సుబ్బరాజు 1944 సంవత్సరం జూలై 1న తంజావూర్‌ జైలులో కన్నుమూశారు. అలాగే ఏలూరుకు చెందిన పైల అచ్చన్న 1930వ సంవత్సరం జూన్‌ 30న ఏలూరులో జరిగిన కాల్పులలో, వేంపాడుకు చెందిన వేగేశిన నారాయణరాజు 1942 సంవత్సరం ఆగస్టు 17న భీమవరంలో జరిగిన కాల్పులలో, పెదమిరానికి చెందిన గొట్టుముక్కల బలరామరాజు 1942వ సంవత్సరం ఆగస్టు 17న భీమవరంలో జరిగిన కాల్పులలో, కుముదవల్లికి చెందిన రుద్రరాజు వెంకట్రాజు 1942 సంవత్సరం ఆగస్టు 17న భీమవరంలో జరిగిన కాల్పులలో మరణింణించగా, మల్లిపూడికి చెందిన దండు వెంకట్రాజు 1942వ సంవత్సరంలో రాజమండ్రి జైలులో, భీమవరం తాలూకా కొవ్వాడకు చెందిన అల్లూరి వెంకట్రాజు 1930వ సంవత్సరం డిసెంబర్‌ 21న అల్లిపురం జైలులో మరణించారు.

తుపాకీ తూటాలకు


స్వాతంత్ర్యోద్యమంలో జరిగిన వివిధ సంఘటనలలో జిల్లాలోని పలువురు స్వాతంత్య్ర సమరయో ధులకు తుపాకీ గుళ్లు తగిలి గాయాలపాలయ్యారు. 1930లో ఏలూరులో జరిగిన కాల్పులలో ఏలూరుకు చెందిన చెన్నంరెడ్డి రాఘవరావు, వేగి దుర్గయ్య, గొర్రెల రాములు, గుండాల అప్పలస్వామి, తేలు కన్న య్య, నరం అప్పలస్వామి, మిండే అప్పల స్వామి, యడ్ల జట్టయ్య, బంక చిన అప్పలస్వామి, కోరాడ రాములు తుపాకీ గుళ్ల బారినపడ్డారు. 1942లో భీమవరానికి చెందిన గండేపల్లి వెంకన్న 1942 సంవత్సరంలో భీమవరంలో జరిగిన కాల్పులలో గుండు వల్ల గాయాలయ్యాయి.

జైలుకు వెళ్లిన దంపతులు


జిల్లాలో జరిగిన వివిధ స్వాతంత్ర్యోద్యమ సంఘ టనలలో పలువురు దంపతులు జైలుకు వెళ్లారు. ఏలూరుకు చెందిన సత్తిరాజు రామమూర్తి, మంగ మ్మ, ఏలూరుకు చెందిన ముడుంబ నరసింహా చార్యులు, వెంకటమ్మ, ఏలూరుకు చెందిన ముడుంబ దొడ్డమాచార్యులు, లక్ష్మీదేవి, పూళ్లకు చెందిన కొటికల పూడి ఆంజనేయులు, సరస్వతి, జిన్నూరుకు చెందిన అల్లూరి సత్యనారాయణరాజు, అన్నపూర్ణ, తనుకుకు చెందిన కొవ్వలి గోపాలరావు, కనకమ్మ, భీమవరానికి చెందిన గోకరాజు సూర్యనారా యణ రాజు, వెంకాయమ్మ, పడమర విప్పర్రుకు చెందిన పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి, ఏలూరుకు చెందిన జవ్వాజి అప్పారావు గుప్తా, రాజరత్నమ్మ, పెదపాడుకు చెందిన డాక్టర్‌ మాల్పూరు రంగయ్య, చుక్కమ్మ, చాగల్లుకు చెందిన తల్లాప్రగడ నరసింహ శర్మ, విశ్వసుం దరమ్మ, తణుకుకు చెందిన తల్లాప్ర గడ నాగరాజు, సుబ్బలక్ష్మి, పెనుగొండకు చెందిన డేగల సూర్యనారాయణ, వెంకట రత్తమ్మ, సత్యవా డకు చెందిన మంతెన సూర్యనారాయణరాజు, నరసమ్మ, నిడదవోలుకు చెందిన గుజ్జువెంకట్రావు, నాగరత్త మ్మ, వాలమర్రుకు చెందిన ఉద్దరాజు రామరాజు (రామం), మాణిక్యాంబ దంపతులు ఉన్నారు.

Updated Date - 2022-08-12T05:13:01+05:30 IST