ఎర్రకోటపై ప్రధాని... బాపూజీ, నేతాజీలతో పాటు ఎవరిని గుర్తుచేసుకున్నారంటే...

ABN , First Publish Date - 2021-08-15T15:56:46+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా...

ఎర్రకోటపై ప్రధాని... బాపూజీ, నేతాజీలతో పాటు ఎవరిని గుర్తుచేసుకున్నారంటే...

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ పలువురు స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుచేసుకున్నారు. గాంధీ మొదలుకొని సుభాష్ చంద్రబోస్ వరకూ, భగత్ సింగ్ మొదలుకొని రామ్ ప్రసాద్ బిస్మిల్ వరకూ... పలువురి సేవలను మోదీ ప్రస్తావించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో బాపూ మాదిరిగా సర్వస్వాన్నీ త్యజించి నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బిస్మిల్, అష్ఫాక్ అల్లాఖాన్ తదితరులు భాగస్వాములయ్యారన్నారు. 


ఝాన్సీ లక్ష్మీబాయి, కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి గైడిల్యూ, అస్సాం మాతంగిని హజ్రా మొదలైన మహిళా మణులు చూపిన తెగువ స్వాతంత్ర్యోద్యమానికి ఊపిరి పోసిందన్నారు. ఇదేవిధంగా దేశ తొలి ప్రధాని నెహ్రూ, దేశాన్ని ఏకతాటిగా నడిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్, భారత్ భవిష్యత్‌ను దర్శించిన బాబా సాహెబ్ అంబేద్కర్,,, ఇలాంటి వారినందరినీ మనం ఈరోజు గుర్తుచేసుకోవాలని మోదీ పేర్కొన్నారు. వీరందరి కృషి ఫలితంగానే నేడు స్వాతంత్ర్య ఫలాలను మనం అనుభవిస్తున్నామన్నారు.

Updated Date - 2021-08-15T15:56:46+05:30 IST