ఉప్పొంగిన దేశభక్తి

ABN , First Publish Date - 2022-08-16T06:32:03+05:30 IST

సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం వాడవాడలా ఘనంగా నిర్వహించారు.

ఉప్పొంగిన  దేశభక్తి
కైకలూరు న్యాయస్థానాల సముదాయంలో పారిశుధ్య కార్మికురాలిని సన్మానిస్తున్న న్యాయమూర్తులు

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

కైకలూరు, ఆగస్టు 15: సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహిం చడంతో కైకలూరు పురవీధులు జనసందోహంగా మారాయి. కైకలూరు న్యాయస్థానాల సముదాయాల్లో జరిగిన వేడుకల్లో సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.షణ్ముఖరావు జాతీయ జెండాను ఆవిష్కరించగా  బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అధ్యక్షుడు తెలగంశెట్టి శ్రీనివాసరావు జెండాను ఆవిష్కరించారు. ఎండా వానలను సైతం లెక్కచేయకుండా నిరంతరం పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికురాలు టెక్కలి నాగమణిని సీనియర్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు జి.షణ్ముఖరావు, కె.శ్రీహరి సత్కరించి నగదును బహుమతి అంద జేశారు.  బార్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు. కైకలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల,  పంచాయతీ కార్యాలయంతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఎమ్మెల్యే నాగేశ్వరరావు జెండాలను ఆవిష్కరించారు. కైకలూరు ఓమోజయ పరిసంస్థాన్‌ ఆధ్వర్యంలో 750 మీటర్ల జాతీయ జెండాను కైకలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్‌ బాలికోన్నతపాఠశాల విద్యార్థులతో కలసి ర్యాలీ నిర్వహించారు. జాగృతి స్కూల్‌ ఆధ్వర్యంలో 500 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే డీఎన్నార్‌, ఎంపీపీ అడవి కృష్ణ,  జడ్పీటీసీ కూరెళ్ళ బేబి,  హెచ్‌ఎంలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే భాష్యం, శ్రీ చైతన్య పాఠశాలల విద్యార్ధులు త్రివర్ణ పతాకాలు చేతపట్టి ర్యాలీలు నిర్వహించారు.   కైకలూరు మండల మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పైడిమర్రి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వ ర్యంలో ఆటోలకు జెండాలకు కట్టి ర్యాలీ నిర్వహించారు. కైకలూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద సీఐ నాయుడు జెండా ఎగురవేశారు. కైకలూరు టీడీపీ కార్యాల యం వద్ద ఆ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో జాతీయజెండాను ఆవిష్క రిం చారు. అలాగే మండలంలోని గోనెపాడులో ఐలమ్మ రజక సంక్షేమ సంఽఘం ఆధ్వ ర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జయమంగళ ముఖ్య అతిధిగా పాల్గొని జెండా ఎగురవేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. జడ్పీటీసీ మాజీ సభ్యులు బొమ్మనబోయిన విజయలక్ష్మి, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పూల రామచంద్రరావు, రజక సంక్షేమ సంఘం అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణ, తెలుగు యువత అధికార ప్రతినిధి వీరవల్లి శివయ్య,  పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పళ్ళెం ఏడుకొండలు  పాల్గొన్నారు.

Updated Date - 2022-08-16T06:32:03+05:30 IST