ఆసిఫాబాద్‌లో కన్నుల పండువగా స్వాతంత్య్ర దినోత్సవం

ABN , First Publish Date - 2022-08-16T04:00:27+05:30 IST

జిల్లా కేంద్రంలో సోమవారం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా ప్రభుత్వ కార్యాల యాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.

ఆసిఫాబాద్‌లో కన్నుల పండువగా స్వాతంత్య్ర దినోత్సవం
కలెక్టరేట్‌లో జెండా ఎగుర వేస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఆగస్టు 15: జిల్లా కేంద్రంలో సోమవారం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా ప్రభుత్వ కార్యాల యాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌, జిల్లాపోలీసు కార్యాలయంలో ఎస్పీ సురేష్‌, కోర్టు ఆవరణలో జిల్లా ప్రధానన్యాయమూర్తి రవీంద్రశర్మ, జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మార్కెట్‌కమిటీ కార్యాలయంలో చైర్మన్‌ గాద వేణి మల్లేష్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో ప్రభాకర్‌రెడ్డి, సామాజికఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ స్వామి, జిల్లా అటవీశాఖ కార్యాలయంలో డీఎఫ్‌వో దినేష్‌కుమార్‌,  పంచాయతీ రాజ్‌ కార్యాలయంలో ఈఈ రామ్మోహన్‌రావు, జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో డీటీవో లక్ష్మి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మల్లికార్జున్‌, జిల్లా గ్రంథాల యంలో చైర్మన్‌ యాదవరావు, నీటిపారుదలశాఖ కార్యాలయంలో డీఈ గుణవంతరావు, మిషన్‌ భగీర థలో ఈఈ వెంకటపతి, గ్రామపంచాయతీలో ప్రత్యేకా ధికారి రమేష్‌, స్పెషల్‌క్లాస్‌ సబ్‌జైలులో సూపరింటెం డెంట్‌ ప్రేంకుమార్‌, బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఉపాధ్యక్షుడు చర్లమురళీ, బీసీ సంక్షేమసంఘ భవ నంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రమేష్‌, గాంధీ చౌక్‌లో స్వాతంత్య్ర సమరయోథుడు దండనాయకుల శ్రీని వాస్‌, సహకారసంఘ కార్యాలయంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌అహ్మద్‌, టీడీపీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి ఆత్మారాం జాతీయజెండాలను ఎగురవేశారు.

Updated Date - 2022-08-16T04:00:27+05:30 IST