స్వాతంత్ర్య దినోత్సవ వేళ... ప్రధాని మోదీ జెండా వందనం

ABN , First Publish Date - 2021-08-15T13:18:15+05:30 IST

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు...

స్వాతంత్ర్య దినోత్సవ వేళ... ప్రధాని మోదీ జెండా వందనం

న్యూఢిల్లీ:  75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఉదయం 7గంటల 30 నిముషాలకు  ఆవిష్కరించారు. అంతకుముందు రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీ సమాధికి ప్రధాని  నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోటకు వచ్చిన ప్రధానమంత్రికి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వాగతం పలికారు. త్రివిధ దళాలు గౌరవవందనం చేశాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 


2022 ఆగస్టు 15వరకూ నిర్వహించే ఆజాదీ కా అమృత మహోత్సవం... ప్రజలకు కొత్త శక్తిని అందించాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న 32 క్రీడాకారులు ఎర్రకోట దగ్గర జరిగే పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొంటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నేపధ్యంలో ఎర్రకోట వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎంట్రీ దగ్గర షిప్పింగ్ కంటైనర్లు నిలిపివుంచారు. 350 సీసీ కెమెరాలతో పాటు 2 ప్రత్యేక పోలీసు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఎర్రకోట దగ్గర 5 వేల మంది పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో  ప్రత్యేక భద్రతా చర్యలు చేప్టటారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, పోలీసు బలగాలను మోహరించారు. 

Updated Date - 2021-08-15T13:18:15+05:30 IST