ఎస్సైపై వేటు పడింది!

ABN , First Publish Date - 2021-06-12T05:45:49+05:30 IST

ఎట్టకేలకు నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి ఎస్సై శివప్రసాద్‌రెడ్డిపై వేటు పడింది. అతన్ని సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం నిజామాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ఎస్సైపై వేటు పడింది!
ఇందల్వాయి ఎస్సై శివప్రసాద్‌రెడ్డి

ఇందల్వాయి ఎస్సై శివప్రసాద్‌రెడ్డి సస్పెన్షన్‌

శుక్రవారం ఉత్తర్వులు జారీచేసిన నిజామాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌రెడ్డి

శనివారం మహిళా కానిస్టేబుల్‌ను సైతం సస్పెండ్‌ చేసే అవకాశం

ఆ వెంటనే ఇద్దరినీ అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలింపు!?

కామారెడ్డి, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి) : ఎట్టకేలకు నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి ఎస్సై శివప్రసాద్‌రెడ్డిపై వేటు పడింది. అతన్ని సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం నిజామాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా గాంఽధారి మండలంలోని మాధవపల్లికి చెందిన శివాజీరావు ఆత్మహత్య కేసులో ఏ2 గా ఉన్న ఇందల్వాయి ఎస్సై శివప్రసాద్‌రెడ్డిపై గాంఽధారి పో లీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో ఎస్సైపై వేటుపడి ంది. కామారెడ్డి ఎస్పీ ఆఫీస్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సంతోషిణితో ఎస్సై శివప్రసాద్‌రెడ్డి వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో అది తట్టుకోలేక సంతోషి ణి భర్త శివాజీరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. శివాజీరావు ఆత్మహత్య చేసుకోవడానికి ఇందల్వా యి ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి బెదిరింపులు, భార్యతో వివాహే తర సంబంధమే కారణమని గ్రామస్థులతో పాటు, మృతు డి సోదరుడు గాంధారి పోలీసులకు సంతోషిణి, ఎస్సై శివప్రసాద్‌రెడ్డిపై ఫిర్యాదు చేయగా.. గాంధారి ఎస్సై శంకర్‌.. సంతోషిణిని ఏ1గా, ఎస్సై శివప్రసాద్‌రెడ్డిని ఏ2గా చేర్చి 306 సెక్షన్‌ ఇంద కేసు నమోదు చేసి ఎల్లారెడ్డి డీఎస్పీకి ని వేదిక పంపారు. ఆ నివేదికను డీఎస్పీ ఐజీకి పంపగా కేసు పూర్వాపరాలు పరిశీలించిన ఐజీ శివశంకర్‌రెడ్డి ఎస్సై శివప్రసాద్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

నేడు మహిళా కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌?

కామారెడ్డి డీపీవోలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ సంతోషిణి సస్పెన్షన్‌ పెండింగ్‌లో పడింది. మహిళా కానిస్టే బుల్‌ సస్పెన్షన్‌ అంశం కామారెడ్డి ఎస్పీ పరిధిలో ఉం డడంతో ఈ జిల్లా అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉం ది. అయితే, శనివారం ఆమెను సైతం సస్పెండ్‌ చేసే అవ కాశం ఉంది. ఆమె సస్పెన్షన్‌ అనంతరం వారిద్దరినీ గాంధా రి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించనున్నట్టు తెలిసింది.

ప్రొబెషనరీ సమయంలోనే వివాదాల్లో ఎస్సై

శివప్రసాద్‌రెడ్డి 2019 డిసెంబరులో ఇందల్వాయి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. గత సంవత్స రం ఫిబ్రవరిలో అతనికి వివాహం జరిగింది. అంతలోనే వి వాహేతర సంబంధంతో రచ్చకెక్కడం పోలీసువర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2018లో ట్రైనింగ్‌లో ఉన్నప్పు డు.. అదే సమయంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ట్రైనింగ్‌ పొం దుతున్న సంతోషినితో సంబంధాలు ఏర్పడ్డాయని, అప్పటి నుంచి వారి మధ్య బంధం కొనసాగుతూ వచ్చిందని తెలిసి ంది. అయితే, వీరి బంధం గురించి సంతోషిణి కుటుంబ స భ్యులకు తెలియడంతో పలుమార్లు హెచ్చరించినట్లు తెలిపారు. అయినా, తీరు మారకపోవడంతో మనస్తాపం చెందిన సంతోషిణి భర్త శివాజీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారిరువురిపై కేసు నమోదైంది. త్వరలోనే వీరిని అరెస్టు చేయనున్నట్టు సమాచారం.

Updated Date - 2021-06-12T05:45:49+05:30 IST