అది మాటల్లో వర్ణించలేని అద్భుతమైన అనుభూతి: శిరీష బండ్ల

ABN , First Publish Date - 2021-07-13T19:32:20+05:30 IST

చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలన్న తన కల నెరవేరిందని వ్యోమగామి శిరీష బండ్ల తెలిపారు. ఆకాశం అంచుల నుంచి భూమిని చూడటం మాటల్లో వర్ణించలేని అద్భుతమైన అనుభూతి అని, తన జీవితాన్నే మార్చేసిన అనుభవం అని అన్నారు. యూనిటీ స్పేస్‌షి్‌పలో మరో ఐదుగురితో కలిసి తెలుగమ్మాయి శిరీష..

అది మాటల్లో వర్ణించలేని అద్భుతమైన అనుభూతి: శిరీష బండ్ల

జీవితాన్నే మార్చిన అనుభవం 

అంతరిక్షంలోకి వెళ్లాలన్న కల నెరవేరింది

త్వరలో అందరికీ చాన్స్‌

మరో 2 స్పేస్‌షిప్‌ల తయారీ

శిరీష బండ్ల వెల్లడి

హూస్టన్‌/గుంటూరు, జూలై 12: చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలన్న తన కల నెరవేరిందని  వ్యోమగామి శిరీష బండ్ల తెలిపారు. ఆకాశం అంచుల నుంచి భూమిని చూడటం మాటల్లో వర్ణించలేని అద్భుతమైన అనుభూతి అని, తన జీవితాన్నే మార్చేసిన అనుభవం అని అన్నారు. యూనిటీ స్పేస్‌షి్‌పలో మరో ఐదుగురితో కలిసి తెలుగమ్మాయి శిరీష.. అంతరిక్షపు అంచుల దాకా వెళ్లి తిరిగివచ్చిన విషయం తెలిసిందే.


సోమవారం ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటినుంచి వ్యోమగామి కావాలని ఉన్నా.. నాసాలో స్థానం సంపాదించడం సాధ్యం కాలేదు. అందుకే మరో దారి వెతుక్కున్నాను. అంతరిక్షంలోకి వెళ్లాలని ఆసక్తి ఉన్న ఎంతోమందికి ఇకపై అది అందుబాటులోకి వస్తుంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ త్వరలో మరో రెండు స్పేస్‌షి్‌పలను తయారు చేయనుంది’’ అని అన్నారు. శిరీష బాల్యంలో తల్లిదండ్రులు అమెరికాలో ఉండగా.. తాతయ్య రాగయ్య వద్దే హైదరాబాద్‌లో  పెరిగారు. కొన్నాళ్లపాటు ఏపీలోని చీరాలలో అమ్మమ్మ వద్ద కూడా పెరిగారు. నాలుగేళ్ల వయసులో అమెరికాలోని తల్లిదండ్రుల వద్దకు చేరారు. ఆమె తాతయ్య డాక్టర్‌ బండ్ల రాగయ్య ప్రస్తుతం గుంటూరులో ఉంటున్నారు. 


సోమవారం రాత్రి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘‘శిరీష ప్రపంచస్థాయిలో ఇంతటి గుర్తింపు తెచ్చుకొంటుందని ఊహించలేదు. ఆమె ప్రయాణం ఖరారైనప్పటినుంచీ మాకుటుంబ సభ్యులకు అభినందనలు అందుతూనే ఉన్నాయి. అంతరిక్షయానానికి బయలుదేరేముందు మెక్సికోలో కుటుంబ సభ్యులను శిరీష కలుసుకొంది. వచ్చే డిసెంబరులో గుంటూరుకు వస్తానని శిరీష చెప్పింది’’ అని చెప్పారు.

Updated Date - 2021-07-13T19:32:20+05:30 IST