విషం చిమ్ముతున్న కరోనా

ABN , First Publish Date - 2020-07-01T11:10:32+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా జరుగుతుండటంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

విషం చిమ్ముతున్న కరోనా

రోజు రోజుకు పెరుగుతున్న వైరస్‌ వ్యాప్తి

తాజాగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముగ్గురి మృతి 

మరో ఆరుగురికి వైరస్‌ పాజిటివ్‌


వనపర్తి (వైద్యవిభాగం)/జడ్చర్ల/కృష్ణ/కోస్గి రూరల్‌/మక్తల్‌ టౌన్‌/నవాబ్‌పట/మానవపాడు, జూన్‌ 30 : కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా జరుగుతుండటంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వైరస్‌ కాటుకు శనివారం ఒక్క రోజే మూడు మరణాలు సంబవించగా, ఉ మ్మడి జిల్లాలో మరో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇద్దరు మహిళలకు కరోనా పాజిటివ్‌ వచ్చిం ది. రామాలయం వద్ద కిరణం షాపు నడుపుతున్న 58 సంవత్సరాల మహి ళకు, రామటాకీస్‌ ముందు ఉన్న దా మోదర్‌ తోట కాలనీలోని 56 సంవత్స రాల మరో మహిళకు మంగళవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.


జడ్చర్ల విద్యుత్‌ శాఖ కార్యాలయం లో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి కి కరోనా సోకింది. గత నెల 28న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకోగా, మంగళవారం పాజిటివ్‌ వచ్చింది.


నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రానికి చెందిన ఓ కిరాణ దుకాణా వ్యాపారికి కరోన వైరస్‌ సోకింది. ఈయన క ర్ణాటక రాష్ట్రం రాయచూర్‌ జిల్లా దేవసూగుర్‌లో నివాసం ఉం టున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు అతన్ని గ్రా మం నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈతని దుకాణంలో పని చేస్తున్న యువకుడికి అధికారులు హోం క్వారంటైన్‌ చేశారు.


కోస్గి మండలం బోగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి పా జిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మహబుబ్‌నగర్‌లో వైద్యపరీక్షలు నిర్వహించగా మంగళవారం ఆయనకు పాజిటివ్‌ అని తేలింది.


నిర్లక్ష్యంగా ఉండకండి

తెలకపల్లి : కరోనా వైరస్‌ విషయంలో ప్రజలు నిర్లక్ష్యానికి పోకుండా, భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన కరోనా నిర్మూ లన అవగాహన యాత్రికుడు రాజామల్లికార్జునరావు అన్నారు. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆయన మంగళవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండలం కేంద్రానికి చేరుకు న్నారు. విజయ బ్యాంక్‌ వద్ద లబ్ధిదారులు సామాజిక దూరం పాటించకుండా బారులు తీరడంపై, వారిలో మాట్లాడారు. అ నంతరం బ్యాంక్‌ సిబ్బందిపై ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవ డంపై అపహనం వ్యక్తం చేశారు


చికిత్స పొందుతూ ముగ్గురి మృతి

నారాయణపేట జిల్లా మక్తల్‌లోని సోనుభాయ్‌ వీధికి చెందిన 62 ఏళ్ల వృద్దురాలు కరోనాతో మంగళవారం ఉద యం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో మృతి చెందినట్లు వైద్యుడు తిరుపతయ్య తెలిపారు. ఈమె  అం త్యక్రియలను ఎర్రగడ్డలోని శ్మశానవాటికలో ఆమె కుమా రుడు నిర్వహించారు. సోనుబాయి వీధిలో మహిళకు క రోనా రావడంతో ముగ్గురు కుటుంబ సభ్యులతోపాటు ప క్క ఇంటి వారు ఎనిమిది మందిని హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు వైద్యులు తెలిపారు.


కరోనాతో చికిత్స పొందుతున్న మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం కొల్లూరు గ్రామానికి చెందిన వ్యక్తి మంగళవారం హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు మీసేవా, మెడికల్‌ దుకాణాలు ని ర్వహిస్తుండటం, బ్యాంక్‌ సమీపంలోనే మీసేవ ఉండటం తో పలువురితో వేలిముద్రలు తీసుకున్నట్లు చెబుతున్నారు. 


జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జ ల్లాపురం గ్రామాంలో ఈ నెల 23న 62 ఏళ్ల వృద్ధుడికి క రోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. చికిత్స నిమిత్తం హై దరాబాద్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మం గళవారం మృతి చెందాడు..

Updated Date - 2020-07-01T11:10:32+05:30 IST