పేరుకుపోతున్న చెత్త

ABN , First Publish Date - 2021-12-05T05:36:13+05:30 IST

గ్రామాల్లోని ప్రధాన రహదారులు, పంటకాలువ గట్టులపై చెత్త పేరుకుపోయి చిన్న చిన్న కొండలను తలపిస్తున్నాయి. లక్షల రూపాయలు ప్రజాధనం వెచ్చించి గ్రామాల్లో చెత్తతో సంపద తయారీ కేంద్రాలు నిర్మించినప్పటికీ ఆవి నిరుపయోగంగానే ఉన్నాయి.

పేరుకుపోతున్న చెత్త
పెద్దాడ-గండ్రేడు రోడ్డుపై కొండలా పేరుకుపోయిన చెత్త

  • కొండలను తలపిస్తున్న చెత్త కుప్పలు
  • నిరుపయోగంగా చెత్తతో సంపద తయారీ కేంద్రాలు 

పెదపూడి, డిసెంబరు 4: గ్రామాల్లోని ప్రధాన రహదారులు, పంటకాలువ గట్టులపై చెత్త పేరుకుపోయి చిన్న చిన్న కొండలను తలపిస్తున్నాయి. లక్షల రూపాయలు ప్రజాధనం వెచ్చించి గ్రామాల్లో చెత్తతో సంపద తయారీ కేంద్రాలు నిర్మించినప్పటికీ ఆవి నిరుపయోగంగానే ఉన్నాయి. అచ్యుపురత్ర యంలో చెత్త సంపద కేంద్రం ఎదురుగా పంటకాలువ గట్టుపై, కరకుదురులో అరట్లకట్ట రోడ్డుపై, పెద్దాడలో పెదపూడి రోడ్డులో పాగాది కాలువగట్టుపై, గండ్రేడు రోడ్డులో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు అతి సమీపంలోనూ చెత్త కొండలా పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నా పట్టించుకునే అధికారి కానీ, నాయకుడు కానీ లేడు. పెదపూడిలో వేట్లపాలెం రోడ్డులో చెత్త వేయరాదు అని పంచాయతీ వారు ఏర్పాటు చేసిన బోర్డు చెత్తతో మూసుకుపోవడం కొసమెరుపు. ప్రతి సంవత్సరం ఆర్భాటంగా స్వచ్ఛ భారత్‌ పేరుతో గ్రామాల్లో స్వచ్ఛతపై మొక్కుబడిగా ర్యాలీలు నిర్వహించడం తప్ప చర్యలు తీసుకోవడం శూన్యం. నేడు స్వచ్ఛ సంకల్పం పేరుతో అధికారులు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తుండడంతో అధికారుల సమయం వృథా తప్ప ఒరిగేది ఏమీ లేదంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. ఇకనైనా అధికాలు స్పందించి ప్రధాన రహదారులు, పంటకాలువ గట్లుపైనా చెత్తను తొలగించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-12-05T05:36:13+05:30 IST