Vizag విమానాశ్రయం నుంచి విమానాలు రయ్.. రయ్..

ABN , First Publish Date - 2022-05-13T13:28:50+05:30 IST

విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమానాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Vizag విమానాశ్రయం నుంచి విమానాలు రయ్.. రయ్..

  • పెరుగుతున్న సర్వీసులు
  • ప్రయాణికులు కూడా...

విశాఖపట్నం : విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమానాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనాకు ముందు రోజూ 90 విమాన సర్వీసులు ఉండేవి. ఆ తరువాత ఆంక్షల కారణంగా విదేశీ విమానాలతో పాటు దేశీయ సర్వీసులు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు మళ్లీ విమానాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు 70 సర్వీసులు నడుస్తున్నాయి. సింగపూర్‌ (Singapore) విమానాన్ని పునరుద్ధరించారు. 


ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 1,370 విమాన (Flight) సర్వీసులు నడవగా వాటి ద్వారా 1,48,080 మంది ప్రయాణించారు. అదే ఏప్రిల్‌కు వచ్చేసరికి విమానాల సంఖ్య 1,758కి పెరిగింది. ప్రయాణికుల సంఖ్య 1,77,083గా నమోదైంది. మే నెలలో 1,838 విమానాలు నడవగా, వాటిలో 1,95,087 మంది ప్రయాణించారు. ప్రతి నెలా విమానాల సంఖ్యతో పాటు ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోందని విమాన ప్రయాణికుల సంఘం తెలిపింది. త్వరలో దుబాయ్‌, మలేషియా విమానాలు కూడా వచ్చేలా ప్రయత్నిస్తున్నామని సంఘం ప్రతినిధులు నరేశ్‌కుమార్‌, వర్మ, కమార్‌రాజాలు తెలిపారు. ఇదిలావుండగా అసాని తుఫాన్‌ కారణంగా సోమవారం కొన్ని, మంగళ, బుధవారాల్లో విమాన సర్వీసులు రద్దయ్యాయి. గురువారం షెడ్యూల్డ్‌ సర్వీసులన్నీ యథాప్రకారం నడిచాయని, ఏమీ రద్దు కాలేదని విమానాశ్రయం డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

Read more