పెరుగుతున్న కరోనా వ్యాప్తి

ABN , First Publish Date - 2020-07-04T10:21:20+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలైన కొత్తగూడెం సింగరేణి, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు తదితర

పెరుగుతున్న కరోనా వ్యాప్తి

భద్రాద్రి జిల్లాలో మరో ముగ్గురికి పాజిటివ్‌ 

అప్రమత్తమైన అధికార యంత్రాంగం


కొత్తగూడెం/భద్రాచలం/చుంచుపల్లి/పినపాక/ఇల్లెందు టౌన్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలైన కొత్తగూడెం సింగరేణి, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు తదితర పట్టణాల్లో ఈ వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతు న్నారు. గ త నెల 29వ తేదీన కొత్తగూడెం పరిధిలో ఆరు కేసులు, పాల్వంచ కేటీపీఎస్‌ పరిధిలో గురువారం ఏడు కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఇల్లెందు, భద్రా చలం, మణుగూరు పరిధిలో మరో ముగ్గురు కరోనా బారినపడ్డారు. ఇప్పటివరకు జిల్లాలో 41 పాజిటివ్‌ కేసు లు నమోదవగా, శుక్రవారం ఒక్కరోజే మూడు కేసులు నమోదయ్యాయి. వీటిలో ఐదుగురు మాత్రమే డిశ్చార్జి అవగా ఇంకా 35 మంది చికిత్స పొందుతున్నారు.  


భద్రాచలంలో ఎలకా్ట్రనిక్‌ మీడియా రిపోర్టర్‌కు లక్షణాలు 

రామక్షేత్రం భద్రాచలంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. పట్టణంలోని శాంతినగర్‌లో నివాసం ఉంటు న్న ఓ ఎలకా్ట్రనిక్‌ మీడియా విలేకరికి ఇటీవల లక్షణాలు బయటపడటంతో భద్రాచలం ఏరియా వైద్యశాలలో నమూనాలు సేకరించారు. ఈ క్రమంలో ఆయనకు పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు అతడిని హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాగే ఆయన భార్య, కుమార్తెతోపాటు ఆయనతో కాంటాక్టులో సుమారు 70మంది ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు వారిని హోంక్వారంటైన్‌ ఉండాలని ఆదేశిం చారు. ఈ ఘటనతో పట్టణంలోని వివిధ శాఖల అధికా రులు, ఉద్యోగులు, వ్యాపారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఐటీడీఏకు సంబంధించిన కార్యకలాపాలు, పీవో పర్యటన లు, ఇతర సమాచారాన్ని తాము వాట్సప్‌, ఈమెయిల్‌ ద్వారా పంపుతామని సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు తెలిపారు. అలాగే భద్రాద్రి దేవస్థానంలో జరిగే పూజా కార్య క్రమాలు, ఇతరత్రా వివరాలను కూడా విలేక రులకు పంపుతామని దేవస్థానం అధికా రులు తెలిపారు.


చుంచుపల్లి మండలం విద్యా నగర్‌ కాలనీలో విద్యుత్‌శాఖలో పని చేసిన  ఓ ఉద్యోగికి పాజిటీవ్‌ వచ్చి నట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం ప్రకటించారు. అతడితో ప్రైమరీ కాంటాక్ట్‌ లిస్ట్‌ 16 మంది వివరాలను సేకరించి వైద్య, పంచా యతీ, రెవెన్యూ సిబ్బంది ఆరా తీస్తు న్నారు. ఇప్పటి వరకు మండలంలో మొత్తం 4 పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి.  


పినపాక మండలంలోని ఏడూళ్లబయ్యారానికి చెందిన ఓ యువకుడికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. గ్రామానికి చెందిన యువకుడు హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడని.. నాలుగు రోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్షకు నమూనాలు ఇచ్చి ఫలితం రాకుండానే స్వగ్రామానికి వచ్చాడని అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం పాజిటివ్‌గా రిపోర్టు రావడంతో వెంటనే హైదరాబాద్‌ తరలిం చారన్నారు. ఆ యువకుడితో కాంటాక్టు అయిన ఆరుగురిని, సెకండిరీ కాంటాక్ట్‌ కింద 22మందిని హోంక్వారంటైన్‌ చేసినట్టు తెలిపారు.  


హోం క్వారంటైన్‌లో ఎమ్మెల్యే హరిప్రియ

ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ హోం క్వారం టైన్‌లో ఉన్నారు. ఇల్లెందు పట్టణంలోని 14వ నెంబర్‌ బస్తీకి చెందిన విద్యార్థిని కరోనాతో గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సదరు విద్యార్థిని గత నెల 23న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తోపాటు పలువురు నేతలను కలవడంతో అధికారుల సూచనల మేరకు ఎమ్మెల్యే హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అలాగే పట్టణంలోని మరో 44మందిని కూడా హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఈ క్రమంలో పట్టణ వ్యాపా రులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ ప్రకటించి మధ్యాహ్నం 2గంటలకే దుకాణాలను మూసివేయాలని నిర్ణయించారు.  

Updated Date - 2020-07-04T10:21:20+05:30 IST