పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-05-06T05:07:17+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి, గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా కేసులు నిర్థారణ అవుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నరసన్నపేట పట్ట ణం, గ్రామాల్లో బుధవారం 83 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు టీడీ హేమసుందర్‌ తెలిపారు.

పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు
మెళియాపుట్టి: అవగాహన కలిగిస్తున్న వైద్యాధికారి

పేటలో 83...

నరసన్నపేట: జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి, గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా కేసులు నిర్థారణ అవుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నరసన్నపేట పట్ట ణం, గ్రామాల్లో బుధవారం 83 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు టీడీ హేమసుందర్‌ తెలిపారు. మొత్తం 664 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, పట్టణం లో వివిధ ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసి ఎవరూ బయటకు రావద్దని సూచనలిచ్చినట్లు ఎంపీ డీవో రవికుమార్‌ పేర్కొన్నారు.  జిల్లాలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు మరింత అవగాహన కలిగించేందుకు గాను  పారా మిలటరీ సంక్షేమ సంఘం బుధవారం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు యాళ్ల అప్పలనాయుడు, సుమన్‌, కె.లక్ష్మణరావు కేవీఆర్‌ మూర్తి, రాజారావు తదితరులు పాల్గొన్నారు.  


రేగిడిలో 60..

 రేగిడి: మండలంలో బుధవారం ఒక్కరోజే 60 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తహసీల్దార్‌ సత్యం తెలిపారు. మండ లంలో ఆరు గ్రామాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉందని, ఆయా గ్రామాల్లో పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఒక గ్రామంలో ఒకే ఇంటి లో ఐదుగురికి పాజిటివ్‌ సోకగా, ఈ విషయం తెలుసుకుని ఆ కుటుంబ పెద్ద ఆందోళనకు గురై బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు ఏఎన్‌ఎం పేర్కొన్నారు. అయితే ఇతని మృతి సాధారణమన్నారు.  


పాతపట్నంలో 40...

 మెళియాపుట్టి (పాతపట్నం): మండల వ్యాప్తంగా బుధవారం విడుదలైన కరోనా పరీక్ష ఫలితాల్లో 40 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తహసీల్దార్‌ ఎం.కాళీ ప్రసాద్‌ తెలిపారు. తన కార్యాలయంలో ఆర్‌ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు విధిగా చేసుకునేలా అవగాహన కలిగించాలన్నారు. కొవిడ్‌ పరీక్షలు చేసుకోకుంటే వైద్యసేవలు అందించవద్దని ఆదేశించారు.


పలాసలో 22...

 పలాస రూరల్‌ : మండలంలో బుధవారం 22 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని  తహసీల్దార్‌ ఎల్‌.మధుసూదనరావు తెలిపారు. గ్రామాల్లో కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.


నందిగాంలో 12...

 నందిగాం: మండలంలో బుధ వారం 12 కరోనా కేసులు నమోదయ్యాయని తహసీల్దార్‌ ఎన్‌.రాజారావు తెలి పారు. పలు గ్రామాలకు చెందిన వారి కి ఇటీవల పరీక్షలు చేయగా పాజిటివ్‌ నిర్ధారణ అయిందన్నారు. వీరందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి జాగ్రత్తలు తీసుకోవాలని కోరామన్నారు. ఈ గ్రా మాల్లో కార్యదర్శుల పర్యవేక్షణలో పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతు న్నట్లు వివరించారు.



ఎల్‌ఎన్‌పేటలో 8...

 ఎల్‌.ఎన్‌.పేట: మండ లంలోని పలు గ్రామాలకు చెందిన ఎని మిది మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు లక్ష్మీనర్సుపేట పీహెచ్‌సీ వైద్యురాలు టి.ప్రవల్లిక బుధవారం తెలిపారు. వీరిలో కొందరిని ఉన్నత వైద్య సేవల కోసం పాత్రునివలస క్వారం టైన్‌ కేంద్రానికి తరలించగా మరికొందనిరి హోం ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. మరో 40 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. వీటి ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. 


 ఎవరూ బయటకు రావొద్దు

 మెళియాపుట్టి: మండల పరిధిలోని గ్రామాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున ఎవరూ బయటకు రావద్దని చాపర పీహెచ్‌సీ వైద్యాధికారి జి.గణపతిరావు తెలిపారు. అలాగే కరజాడ ఆరోగ్య కేంద్రం పరిధిలో 150 కేసులున్నాయని, అందువల్ల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారి ప్రసాద రెడ్డి తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు.  

 



 

Updated Date - 2021-05-06T05:07:17+05:30 IST