పెరుగుతున్న కరోనా వ్యాప్తి

ABN , First Publish Date - 2021-04-06T06:08:50+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. సోమవారం కొత్తగా మరో 95 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,963కు చేరింది.

పెరుగుతున్న కరోనా వ్యాప్తి

రోజురోజుకూ పెరుగుతున్న కేసులు

సోమవారం కొత్తగా 95 కేసులు నమోదు

అప్రమత్తతతోనే అరికట్టవచ్చంటున్న వైద్యులు

ఆర్మూర్‌/బోధన్‌, ఏప్రిల్‌ 5: జిల్లాలో కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. సోమవారం కొత్తగా మరో 95 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,963కు చేరింది. సోమవారం  ఆ ర్మూర్‌ సీహెచ్‌సీలో 91మందికి పరీక్షలు నిర్వహించగా 25 మందికి పాజిటివ్‌ వచ్చింది. డివిజన్‌లోని మిగతా పీహె చ్‌సీలలోనూ పాజిటివ్‌ కేసులు నమోదువుతున్నాయి. ప్ర భుత్వ ఆసుపత్రులలో పరీక్షించి కేసులు మాత్రమే లెక్క లోకి వస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులలో పరీక్షించిన కే సులు లెక్కలోకి రావడంలేదు. ప్రైవేటు ఆసుపత్రులలో పాజిటివ్‌ వచ్చినవారు రహస్యంగా చికిత్స తీసుకుంటు న్నారు. వారు బయటకు కూడా చెప్పుకోవడంలేదు. పట్ట ణంలో ప్రతీ వీధిలో కరోనా రోగులున్నారు. మొదటి విడ త కంటే రెండో విడతలో ఎక్కువగా కేసులు నమోదవుతు న్నాయి. రెండో విడతలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొ న్ని కుటుంబాలలో అందరూ కరోనా బారినపడ్డారు. మరి కొన్ని కుంటుంబాలలో ఇద్దరు, ముగ్గురికి కరోనా సోకింది. ఆర్మూర్‌ పట్టణానికి చెందిన ఒకరు ఆదివారం కరోనాతో నిజామాబాద్‌లో మరణించారు. ఆసుపత్రి సిబ్బంది సూ చన మేరకు శవాన్ని నేరుగా శ్మాశాన వాటికకు తీసుకెళ్లా రు. మృతుడి సామాజికవర్గానికి చెందిన 25మందికి వా రం పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. మరికొందరికి పరీక్షించాల్సి ఉంది. ముఖ్యంగా వివిధ పార్టీ లకు చెందిన రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డా రు. సమావేశాలు, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం వ ల్ల కరోనా సోకినట్లు తెలుస్తోంది. 

చాప కింద నీరులా కరోనా

బోధన్‌ డివిజన్‌లో కరోనా చాపకింద నీరులా విజృంభి స్తోంది. డివిజన్‌ పరిధిలోని అన్ని మండలాల్లో కరోనా కే సులు బహిర్గతమవుతున్నాయి. మండలాల్లో కరోనా కేసు లు వెలుగుచూస్తుండడం అప్రమత్తతను చెప్పకనే చెబు తోంది. ఇప్పటి వరకు వెలుగుచూసినా కరోనా కేసులన్నీ ప్రజల నిర్లక్ష్యం వల్లనే విస్తరించాయి. విందులు, వినోదా లు, శుభకార్యాలు, మూకుమ్మడి కార్యక్రమాల వల్ల కరోనా కేసులు బహిర్గతం అవుతున్నాయి. బోధన్‌ డివిజన్‌ పరిఽధి లోని వర్ని, చందూరు, మోస్రా, కోటగిరి, రుద్రూరు, ఎడ పల్లి, రెంజల్‌, నవీపేట మండలాలతోపాటు బోధన్‌ పట్ట ణం, బోధన్‌ మండలాలలో కరోనా కేసులు భారీగా వెలు గుచూశాయి. బోధన్‌ డివిజన్‌ ప్రాంతం మహారాష్ట్రకు సరిహద్దున ఉండడంతో మహారాష్ట్ర వాసులతో అధిక సం బంధాలు ఉండడంతో కరోనా కేసులు భారీగా వెలుగచూ స్తున్నాయి. సరిహద్దు మండలాల్లోని వివిధ గ్రామాల ప్ర జలు మహారాష్ట్రకు వెళ్లి వస్తుండడం, మహారాష్ట్ర వాసు లు ఇక్కడి గ్రామాలకు వచ్చి వెళ్తుండడం కరోనా వ్యాప్తికి ప్రధాన కారణమవుతోంది. శుభకార్యాలు, బర్త్‌డే ఫంక్షన్‌ లు, చావులు, పెళ్లిలు, ఇతర అవసరాల నిమిత్తం సాగు తున్న రాకపోకలు కరోనా వ్యాప్తిని పెంచుతున్నాయి. వ ర్ని మండలం సిద్దాపూర్‌లో శుభకార్యానికి వెళ్లిరాగానే భా రీగా కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. వా రం రోజుల వ్యవధిలో సిద్దాపూర్‌లో సుమారు 70 పైనే క రోనా పాజిటివ్‌ కేసులు నమోదుకావడం ఆందోళనకు గు రి చేస్తోంది. కోటగిరి మండలం సుంకిని గ్రామంలో ఓ బర్త్‌డే ఫంక్షన్‌ కరోనాకు కారణమయింది. ఈ గ్రామంలో సుమారు 20పైనే కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశా యి. సోమవారం ఒక్కరోజే రుద్రూరులో 10పైనే కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. 17 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే పది పైనే పాజిటివ్‌ రావడం అందులో 10 కే సులు రుద్రూరువి కావడం ఆందోళన కలిగిస్తోంది. బోధ న్‌లో గత నాలుగు రోజులుగా ప్రతిరోజు సుమారు 30 ను ంచి 50 వరకు కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వ స్తున్నాయి. అరకొరగా పరీక్షలు నిర్వహిస్తేనే ఇంత పెద్ద మొత్తంలో పాజిటివ్‌ కేసులు వస్తుండడం ఆందోళనకరం గా మారింది. షాపింగ్‌మాల్స్‌, రద్దీ ప్రాంతాలు, దుకాణ స ముదాయాలు, హోటళ్లు, దాబాలు, సిట్టింగ్‌ అడ్డాలు కరో నా వ్యాప్తికి కారణంగా మారుతున్నాయి. వ్యక్తిగతంగా జా గ్రత్తలు తీసుకుంటేనే కరోనాకు అడ్డుకట్ట పడనుంది. 

 టీకా వేసుకోవడానికి ఆసక్తి.. 

 కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ప్రజలు టీకా వే సుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల లో 45ఏళ్లు నిండిన వారందరికి టీకా వేస్తున్నారు. ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా వేస్తున్నారు. జిల్లాలో మొత్తం 41ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో టీకా మందు అందుబాటులో ఉంది. 19ప్రైవేటు ఆసుపత్రులకు అను మతినిచ్చారు. ఆర్మూర్‌ సీహెచ్‌సీలో ఒకటో తేదీన 184, 2వ తేదీన 238, 3వ తేదీన 196, 4వ తేదీన 94, సోమ వారం 235మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కరోన వ్యాప్తి తీ వ్రంగా ఉన్నప్పటికీ అనేక మంది నిబంధనలు పాటించ డం లేదు. చాలా మంది మాస్కులు లేకుండా తిరుగుతు న్నారు. దుకాణాలు, బస్టాండ్‌లు, బస్సులలోనూ నిబంధన లు అమలు కావడంలేదు. అధికారులు చర్యలు తీసుకోవా లని ప్రజలు కోరుతున్నారు.  

కరోనాతో వైద్యుడి చికిత్స.. ఆసుపత్రి సీజ్‌

ఖిల్లా : నగరంలో ఓ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడు తనకు కరోనా పాజిటివ్‌ ఉన్నప్పటికీ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో డీఎం హెచ్‌వో సుదర్శనం సోమవారం రాత్రి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని 30 మంది సిబ్బంది కి కొవిడ్‌ పరీక్షలు చేయించగా 10మందికి పాజిటివ్‌ తేలి ంది. దీంతో సదరు ఆసుపత్రి వైద్యుడికి కూడా పరీక్ష నిర్వహించబోగా ఆయన తప్పించుకొని పారిపోయాడు. సు మారు రెండు గంటలు ఆ డాక్టర్‌ కోసం వేచి ఉన్నా అత డు రాకపోవడంతో ఆ ఆసుపత్రిని సీజ్‌ చేసినట్టు డీఎం హెచ్‌వో డాక్టర్‌ సుదర్శనం తెలిపారు.

కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని ఇంట్లోకి రానివ్వని యజమాని

మోపాల్‌: కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని ఇంట్లోకి అ నుమతించకపోవడంతో అతడు కంపోస్టు షెడ్డులో తలదాచుకున్న ఘటన సోమవారం మోపాల్‌ మండలంలో వెలుగు చూసింది. మండలంలోని మంచిప్ప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ముదక్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలోని బో ర్గాం కొవిడ్‌ సెంటర్‌లో  సోమవారం కరోనా పరీక్ష నిర్వహించుకోగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతడు అద్దెకు ఉ ంటున్న ఇంటి యజమాని అతన్ని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆ వ్యక్తి కుటుంబంతో సహా గ్రామ శివారులోని కంపోస్టు షెడ్డులో తలదాచుకుంటున్నాడు. ఈ విషయం మండలంలో చర్చనీయాంశమైంది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. 

కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలి : డీఎంహెచ్‌వో

వర్ని: జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున  ప్ర జలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుదర్శనం సూచించారు. సోమవారం ఆయన సిద్ధాపూర్‌  గ్రామాన్ని సందర్శించి ప్రజలకు కొవిడ్‌-19పై బాధితుల కు, ప్రజలకు పలు సూచనలు ఇచ్చారు. అత్యవసరమైతే నే బయటకు వెళ్లాలని, మాస్కులు తప్పకుండా ధరించాలని సూచించారు.

Updated Date - 2021-04-06T06:08:50+05:30 IST