పెరిగిన ఓటర్లు

ABN , First Publish Date - 2021-01-16T05:52:36+05:30 IST

జిల్లాలో ఓటర్లు స్వల్పంగా పెరిగారు. శుక్రవారం విడుదల చేసిన తుది జాబితాలో 36,67,693 మంది ఓటర్లు ఉన్నారు.

పెరిగిన ఓటర్లు

జిల్లాలో మొత్తం 36,67,693

పురుషులు 18,16,277, మహిళలు 18,51,196, ఇతరులు 220

గతం కంటే 42,312 అధికం

గాజువాక నియోజకవర్గంలో అత్యధికంగా 3,22,155

అత్యల్పంగా మాడుగులలో 1,91,111


విశాఖపట్నం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి):


జిల్లాలో ఓటర్లు స్వల్పంగా పెరిగారు. శుక్రవారం విడుదల చేసిన తుది జాబితాలో 36,67,693 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 18,16,277, మహిళలు 18,51,196, ఇతరులు 220 మంది ఉన్నారు. తొలుత గత ఏడాది నవంబరు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు. ముసాయిదా జాబితాలో మొత్తం ఓటర్లు 36,25,381 కాగా పురుషులు 17,96,185, మహిళలు 18,28,986, ఇతరులు 210 మంది. అయితే ముసాయిదా జాబితాపైౖ అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితా శుక్రవారం విడుదల చేశారు. ముసాయిదా జాబితాలో కంటే తుది జాబితాలో 42,312 మంది ఓటర్లు పెరిగారు. కాగా జిల్లాలో 7,790 మంది సర్వీస్‌ ఓటర్లు వుండగా వారిలో పురుషులు 7,471, మహిళలు 319 మంది ఉన్నారు. అత్యధికంగా గాజువాక నియోజకవర్గ పరిధిలో 3,22,155 మంది ఓటర్లు ఉండగా, ఆ తరువాత స్థానాల్లో భీమిలి (3,20,819), విశాఖపట్నం నార్త్‌ (2,85,097) ఉన్నాయి. అత్యల్పంగా మాడుగల నియోజక వర్గంలో 1,91,111 మంది ఉన్నారు. ప్రతి ఏడాది నవంబరులో కొత్తఓటర్ల నమోదు, సవరణలు, తొలగింపులు అనంతరం జనవరిలో 15న తుది జాబితా విడుదల చేస్తారు. 


2021 తుది ఓటర్ల జాబితా


నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం


భీమిలి 1,58,991 1,61,806 22 3,20,819

విశాఖ తూర్పు 1,35,025 1,38,390 22 2,73,437

విశాఖ దక్షిణ 1,08,259 1,09,359 32 2,17,650

విశాఖ ఉత్తర 1,41,886 1,43,190 21 2,85,097

విశాఖపశ్చిమ 1,22,886 1,15,083 12 2,37,981

గాజువాక 1,63,723 1,58,416 16 3,22,155

చోడవరం 1,04,515 1,10,344 14 2,14,873

మాడుగుల 93,573 97,533 05 1,91,111

అరకు 1,10,458 1,15,613 06 2,26,077

పాడేరు 1,12,206 1,18,414 13 2,30,633

అనకాపల్లి 1,03,288 1,08,794 16 2,12,098

పెందుర్తి 1,35,808 1,36,065 0 2,71,873

ఎలమంచిలి 99,955 1,04,091 20 2,04,066

పాయకరావుపేట 1,21,909 1,24,442 02 2,46,353

నర్సీపట్నం 1,03,795 1,09,656 19 2,13,470

మొత్తం 18,16,277 18,51,196 220 36,67,693


Updated Date - 2021-01-16T05:52:36+05:30 IST