Abn logo
Jan 27 2021 @ 00:55AM

మన్యంలో పెరిగిన మంచు ఉధృతి


చింతపల్లి, జనవరి 26: మన్యంలో మంచు ఉధృతి పెరిగింది. వాతావరణంలో కలిగిన మార్పులతో ఐదు రోజులుగా చింతపల్లి, లంబసింగి ప్రాంతాల్లో మంచు సోయగాలు పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం మళ్లీ మంచు దట్టంగా కురుస్తున్నది. మంగళవారం లంబసింగి, చింతపల్లి, చెరువులవేనం ప్రాంతాల్లో ఉదయం పది గంటల వరకు మందు వీడలేదు. దీంతో లంబసింగి సందర్శిస్తున్న పర్యాటకులు మంచు అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. చింతపల్లిలో మంగళవారం 11.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 

Advertisement
Advertisement
Advertisement